దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్లు నిరసనలో పాల్గొన్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి 21 వేల జీతం ఇవ్వాలని మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ గాంధీ ఆస్పత్రి ప్రధాన కార్యదర్శి పుల్లయ్య కోరారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
కార్మిక చట్టాల సవరణ ఆపి, పీఆర్సీ విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిష్టమ్మ, శోభా, పుష్పా, శ్రీధర్, లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కార్మిక సంఘాల ఆందోళన.. స్తంభించిన రవాణా