AirTel Goodnews: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇటీవల టారిఫ్ ధరలను భారీగా పెంచేసిన ఎయిర్టెల్..…తాజాగా ప్రీ పెయిడ్ సెలెక్టెడ్ ప్లాన్లపై రోజుకు 500 ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అయితే దీనికి కొన్ని షరతులు విధించింది. రోజూ ఫ్రీ డేటా 500 ఎంబీ పొందాలంటే మీరు రూ.265, 299, 719, 839 ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని మినహాయించి మిగతా ప్రీ పెయిడ్ ప్లాన్లకు ఈ ఆఫర్ వర్తించదని ఎయిర్టెల్ తెలిపింది.
ఇక ప్రస్తుత ఆఫర్‌తో రీఛార్జ్ చేసుకుంటే రూ.265తో ప్లాన్‌తో ఇదివరకు రోజుకు 1 జీబీ డేటా వచ్చేది.. ఇక నుంచి 28 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటా పొందవచ్చు. అలాగే రూ. 299 ప్లాన్‌తో 28 రోజుల పాటు 2 జీబీ డేటా వస్తుంది. రూ.719 రీచార్జ్‌తో 84 రోజుల పాటు 1.5 జీబీ అందిస్తుంది.. రూ.839 ప్లాన్‌తో రోజుకు 2.5 జీబీ డేటా వస్తుంది.