రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి హానగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసిన తెరాస... అనూహ్యంగా మజ్లిస్ అవసరం లేకుండానే మేయర్ స్థానాన్ని చేజిక్కించుకొంది. 2009లో కాంగ్రెస్ సహకారంతో రెండున్నర ఏళ్లపాటు మేయర్ పదివి చేపట్టిన మజ్లిస్... 2016 ల్లో భంగపడింది. 60 స్థానాల్లో పోటీ చేసి 44 స్థానాలు దక్కించుకొంది. మొదటిసారిగా 150 స్థానాల్లో పోటీ చేసిన తెరాస... 99స్థానాలు దక్కించుకొంది. దీనికి తోడు కాంగ్రెస్ నుంచి ఇద్దరు, మరో తెదేపా కార్పోరేటర్ చేరికతో... తెరాస బలం 102కు పెరిగింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఆ పార్టీకే దక్కాయి. ప్రతిసారీ నగరపాలక ఎన్నికల్లో మిత్రుల సహకారంతో... మేయర్ పీఠాన్ని దక్కించుకొనేందుకు యత్నించే మజ్లిస్... ఈసారి వేచిచూసే ధోరణితో ముందుకు సాగుతోంది.
నువ్వా-నేనా
దుబ్బాక ఎన్నికలతో మంచి ఊపులో ఉన్న భాజపా... మహానగరపాలక ఎన్నికల్లో ఓటర్లను తమదైన శైలిలో పార్టీ వైపు తిప్పుకొనేందుకు యత్నిస్తోంది. మజ్లిస్ కూడా అదే తరహా ప్రయోగాలు కొనసాగిస్తోంది. తెరాస అభివృద్ధి నినాదంతో అధిక స్థానాలు గెలుచుకొనేందుకు ప్రయత్నిస్తుండగా... మజ్లిస్ మాత్రం తన బలం పెంచుకొనేందుకు పావులు కదుపుతోంది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగూడ, జంగంమెట్ ప్రాంతాల్లో భాజపా, ఎంఐఎం నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి.
గెలుపు గుర్రాల ఎంపిక
భాజపా సిట్టింగ్ స్థానాలైన... గౌలిపుర, ఘాంజిబజార్, బేగంబజార్ను చేజిక్కించుకోవాలని ఎంఐఎం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవలి వరదల కారణంగా అత్యధికంగా మజ్లిస్ ప్రాతినిద్యం వహిస్తున్న ప్రాంతాలే ముంపునకు గురైనందున... నష్టం జరగకుండా గెలుపు గుర్రాలనే ఎంపిక చేస్తున్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన స్థానాల్లో కొంతమంది సిట్టింగ్ అభ్యర్థులను మార్చేందుకు యోచిస్తోంది. అధికారికంగా పేర్లను ప్రకటించకపోయినా... నామపత్రాలు మాత్రం దాఖలు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి: బల్దియాలో డిజిటల్ ప్రచారం.. సోషల్ వారియర్స్ దూకుడు