ETV Bharat / city

'కాంగ్రెస్​లో కోవర్టులున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి' - కాంగ్రెస్ సీనియర్ల మీటింగ్

అశోక హోటల్​లో కాంగ్రెస్​ సీనియర్ నేతలు సమావేశం కావడంపై పార్టీ నేతలు స్పందించారు. సీనియర్లకు పార్టీలో ఏదైనా సమస్యలుంటే గాంధీభవన్‌లో చర్చించుకోవాలని సూచించారు. సీనియర్లు కలిసి వచ్చి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని అన్నారు.

congress
congress
author img

By

Published : Mar 20, 2022, 4:54 PM IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ రోజు రోజుకు బలపడుతోందని... రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక పార్టీ ప్రజల్లోకి బాగా వెళ్లిందని మాజీ విప్ అనిల్‌ తెలిపారు. జగ్గారెడ్డి, వీహెచ్‌, మర్రి శశిధర్ రెడ్డిలు ఆలోచించుకోవాలన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్‌తో పాటు అద్దంకి దయాకర్​, బెల్లయ్యనాయక్‌, మానవతారాయ్‌ మాట్లాడారు.

పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే...

సీనియర్లకు పార్టీలో ఏదైనా సమస్యలుంటే గాంధీభవన్‌లో చర్చించుకోవాలని అనిల్ సూచించారు. వీహెచ్‌ ఒక ఎమ్మెల్సీ ద్వారా హరీశ్​ రావును కలవాల్సిన పనేముందని ప్రశ్నించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్ద నాయకులు పనిచేసినా వారిని సస్పెండ్ చేయాలని అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో కొత్త టీమ్స్ వచ్చాక పార్టీ బలోపేతమయిందని ప్రజల్లో విశ్వాసం పెరిగిందని బెల్లయ్యనాయక్ అన్నారు. పార్టీలో కార్యకర్తలు చెమటోడ్చిపని చేస్తున్నారని వారికి నష్టం చేయవద్దన్నారు.

కోవర్టులున్నారనే అనుమానాలు...

కాంగ్రెస్ పార్టీలో భాజపా, తెరాస కోవర్టులున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని మానవతారాయ్‌ అన్నారు. ఇక నుంచి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కార్యకర్తలు తన్ని తరిమివేస్తారని హెచ్చరించారు. సీనియర్లు కలిసి వచ్చి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని అద్దంకి దయాకర్ సూచించారు. కాంగ్రెస్‌ను విభజించు పాలించు మాదిరిగా తెరాస చేస్తోందని ఆరోపించారు.

అనంతరం సీనియర్ల వద్దకు

మీడియా సమావేశం అనంతరం ఏఐసీసీ అధికార ప్రతినిధులు మానవతారాయ్, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్‌... అశోక హోటల్​లో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్​ నేతల వద్దకు వెళ్లారు. అయితే ముగ్గురిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని జగ్గారెడ్డి సూచించారు. దీంతో వాళ్లు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమావేశం అనంతరం జగ్గారెడ్డితో అద్దంకి దయాకర్, మానవతారాయ్, బెల్లయ్య నాయక్ భేటీ అయ్యారు. పార్టీలో తనకు అవమానాలు జరుగుతున్నాయని... పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిని ఏకరువు పెట్టారు.

ఇదీ చదవండి : నన్ను సస్పెండ్ చేస్తే.. రోజుకొకరి బండారం బయట పెడతా: జగ్గారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.