ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆలస్యానికి భాజపా, తెరాస ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. దీనిపై మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని అన్నారు.
2008లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు సాంకేతిక పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 50 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఇచ్చే ఈ ప్రాజెక్టును ఏడేళ్ల నుంచి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు ఆలస్యం వల్ల తెలంగాణ నష్టపోయిందని... కేటీఆర్ చిత్తశుద్ధితో పనిచేసి కేంద్రం నుంచి ఐటీఐఆర్‌ను సాధించాలని అన్నారు.
- ఇదీ చూడండి : ఈనెల 11న ఉచిత తాగునీటి పథకం ప్రారంభం