రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్ధరణ టెస్టులు చేయడంలో పారదర్శకత కోల్పోయిందని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో నారాయణ రెడ్డి చేతుల మీదుగా పేదలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. అడ్డగుట్ట సామాజిక కార్యకర్తలు మస్తాన్, రాజు పాల్గొన్నారు.
ప్రజలంతా భౌతిక దూరం పాటించి కరోనా వైరస్ బారిన పడకుండ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో కరోనా పట్ల చైతన్యం నింపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు.
ఇదీ చూడండి: వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ