Agrigold Victims Protest: ఆంధ్రప్రదేశ్‌లో సాయం కోసం నిరీక్షిస్తూ ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు మళ్లీ రోడ్డెక్కక తప్పలేదు. వివిధ జిల్లాల నుంచి విజయవాడ వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడ ధర్నాచౌక్‌లో న్యాయం కోసం గొంతెత్తారు. అధికారంలోకి రాకముందు సీఎం జగన్ తమకిచ్చిన హామీలన్నీ ప్రస్తుతం నీటమూటలే అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు సాయం చేస్తామని చెప్పి.. పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా న్యాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అగ్రిగోల్డ్ బాధితుల తరఫున మొదటి నుంచీ పోరాడుతున్న సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వర్రావు.. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని సీపీఐ, లోక్‌సత్తా పార్టీలు డిమాండ్ చేశాయి. వివిధ జిల్లాల నుంచి విజయవాడ వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులు.. హామీ ఇచ్చి సీఎం జగన్ మరిచిపోయారంటూ మండిపడ్డారు.
"అధికారం చేపట్టిన వారంలో న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు సాయం చేస్తామన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసి వారి ఆధీనంలో ఉంచుకున్నారు. చనిపోయేదాకా మాకు న్యాయం జరగదా?." -అగ్రిగోల్డ్ బాధితులు
ఇవీ చదవండి:
ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత.. సాగర్‌లో నిమజ్జనంపై వీడని ఉత్కంఠ.!
'భారత్‌తో మాది అలాంటి స్నేహమే.. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం పక్కా'