కొవిడ్‌తో అగ్రిగోల్డ్ డైరెక్టర్లలో ఒకరైన సవడం శ్రీనివాస్( 52 ) మృతి చెందారు. అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ మార్క్‌కు చెందిన శ్రీనివాస్‌కు కరోనా సోకటంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వారం రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించటంతో మృతి చెందారని సన్నిహితులు వెల్లడించారు.
ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అగ్రిగోల్డ్ సంస్థలో మొత్తం 150 మంది వరకు వివిధ విభాగాల్లో డైరక్టర్లుగా ఉండగా వీరిలో శ్రీనివాస్ ఒకరు. ఇప్పటికే వివిధ కారణాలతో అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ముగ్గురు మృతి చెందారు.
ఇదీ చదవండి: కరోనా రోగుల రక్తాన్ని తాగుతున్న కార్పొరేట్ ఆస్పత్రులు!