ETV Bharat / city

తెలంగాణలో విత్తనరంగ అభివృద్ధి చర్యలు... భేష్‌

విత్తన రంగం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయమని జర్మన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందం కొనియాడింది. జర్మనీ ఆహ్వానం మేరకు పర్యటనలో భాగంగా బెర్లిన్‌లో ఆ దేశ వ్యవసాయశాఖ ప్రతినిధి బృందంతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టు ద్వారా విత్తన రంగంలో అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ది సాధించిందని జర్మనీ ప్రశంసించింది.

తెలంగాణలో విత్తనరంగ అభివృద్ధి చర్యలు... భేష్‌
author img

By

Published : Oct 31, 2019, 3:54 AM IST

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం జర్మనీలో పర్యటిస్తోంది. రెండో పర్యటనలో భాగంగా జర్మనీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల ప్రతినిధి బృందంతో... మంత్రి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ కార్యక్రమంలో జర్మన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందం ప్రతినిధులు, జీఎఫ్​ఏ, కన్సల్టింగ్ గ్రూప్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. మంత్రితోపాటు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్, విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, విత్తనాభివృద్ది సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ఉన్నారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు విత్తనోత్పత్తి, ధ్రువీకరణలో సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంచామని మంత్రి బృందం వివరించింది.

విత్తన ధృవీకరణలో సహకారం కావాలి

అంతర్జాతీయ విత్తన ధృవీకరణ ద్వారా విత్తన ఎగుమతులు ప్రోత్సహించి, విత్తన వాణిజ్యం పెంపొందిస్తున్నామని ప్రకటించారు. నాణ్యమైన విత్తనోత్పత్తికి రైతులు పాటించవలసిన మెళకువలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై, ప్రాంతీయ భాషలో పలు ప్రచురణలు తయారు చేసి, విత్తన రైతులకు పంపిణీ చేశామని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కొత్త విత్తన విధానం, విత్తన కౌన్సిల్, అంతర్జాతీయ విత్తన సలహామండలి, ఓఈసీడీ అంతర్జాతీయ విత్తన ధృవీకరణ అంశాల్లో జర్మన్ వ్యవసాయ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమీపంలోని బండమైలారంలో గల 150 ఎకరాల్లోని విత్తనపార్కులో పరిశోధన సంస్థలు, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, శీతల గిడ్డంగులు ఉన్నాయని మంత్రి బృందం... జర్మన్​ బృందానికి తెలిపింది.

సానుకూలంగా స్పందించిన జర్మనీ

ఫుడ్ - ప్రాసెసింగ్ రంగంలో జర్మనీ అవలంభిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల విషయంలో తెలంగాణకు సహకారం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన వినతిపై జర్మనీ సానుకూలంగా స్పందించి సంసిద్ధత వ్యక్తం చేసింది. తమ ఆహ్వానాన్ని మన్నించి జర్మనీ పర్యటనకు విచ్చేసినందుకు జర్మనీ వ్యవసాయ మంత్రిత్వ బృందం ధన్యవాదాలు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విత్తన రంగ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు.

తెలంగాణలో విత్తనరంగ అభివృద్ధి చర్యలు... భేష్‌

ఇవీ చూడండి: ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... కోర్టుకు నివేదికపై సమాలోచనలు!

31-10-2019 TG_HYD_02_31_AGRI_MINISTER_GERMANY_TOUR_PKG_3038200 REPORTER : MALLIK.B Note : vedios and pics from desk whatsApp ( ) విత్తన రంగం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం అని జర్మన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందం కొనియాడింది. జర్మనీ ఆహ్వానం మేరకు పర్యటనలో భాగంగా బెర్లిన్‌లో ఆ దేశ వ్యవసాయశాఖ ప్రతినిధి బృందంతో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టు ద్వారా విత్తన రంగంలో అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ది సాధించిందని జర్మనీ ప్రశంసించింది. విత్తనరంగ అభివృద్ధిపై ఇండో-జర్మన్ ద్వైపాక్షిక సహకార ప్రాజెక్టును మూడో విడతకు పొడిగించినందుకు జర్మనీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసింది. LOOK.......... VOICE OVER - 1 వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం జర్మనీలో పర్యటిస్తోంది. రెండో పర్యటనలో భాగంగా జర్మనీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల ప్రతినిధి బృందతో... మంత్రి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది.ఈ కార్యక్రమంలో జర్మన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందం ప్రతినిధులు బీటే కాస్చ్, అంతర్జాతీయ సంబంధాల ప్రతినిధి ఫ్రేదిల్డే ట్రాట్ వీన్, విత్తన అంతర్జాతీయ సంబంధాల అధికారి కుమార్ ఎన్ వీటిల్, ఇండియన్ ఎంబసీ డాక్టర్ ఉల్రిచ్ కెన్వెచ్చర్, జి ఎఫ్ ఏ, కన్సల్టింగ్ గ్రూప్ ప్రతినిధులు నదినే కొన్లే, ఉల్రికే ముల్లర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రితోపాటు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి గారు, ఎమ్మెల్యేలు ఆలె వెంకటేశ్వర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్, విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, విత్తనాభివృద్ది సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ఉన్నారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు 2017 నుండి విత్తనోత్పత్తిదారులు, విత్తన రైతులకు, విత్తన ధృవీకరణ అధికారులకు నాణ్యమైన విత్తనోత్పత్తి, దృవీకరణపైన, పద్ధతులపైనా సాంకేతిక పరిజ్ఞానం అందించడం ద్వారా నైపుణ్యతను మెరుగుపరచడo జరిగిందని తెలంగాణ ప్రతినిధి బృందం... జర్మనీ ప్రతినిధులకు తెలిపింది. అంతర్జాతీయ విత్తన ధృవీకరణ ద్వారా విత్తన ఎగుమతులు ప్రోత్సహించి, విత్తన వాణిజ్యం పెంపొందిస్తున్నామని ప్రకటించారు. విత్తన రంగ అభివృద్దికి చేపడుతున్న కార్యక్రమాలకు సహకారం, విత్తన రంగ నియంత్రణ విధానంపై చేసిన క్షేత్ర స్థాయి అధ్యయనం, భారత విత్తన పరిశ్రమ పరిస్థితి, విత్తన చట్టాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విత్తన సంస్థలు, విత్తన సరఫరా పద్దతిలో వత్యాసాలు, సమస్యలు గుర్తించి, మార్పులు చేర్పులు చేయటానికి ఉన్న అవకాశాలపై దృష్టి సాధించడానికి ఎంతో ఉపయోగపడిందని పేర్కొంది. నాణ్యమైన విత్తనోత్పత్తికి రైతులు పాటించవలసిన మెళకువలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై, ప్రాంతీయ భాషలో పలు ప్రచురణలు తయారు చేసి, విత్తన రైతులకు పంపిణీ చేశామని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు తెలంగాణను భారత విత్తన భాండాగారం నుండి ప్రపంచ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కొత్త విత్తన విధానం, విత్తన కౌన్సిల్, అంతర్జాతీయ విత్తన సలహామండలి, ఓఈసీడీ అంతర్జాతీయ విత్తన ధృవీకరణ అంశాలల్లో జర్మన్ వ్యవసాయ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమీపంలో బండమైలారంలో 150 ఎకరాల్లో విత్తనపార్కు ఏర్పాటు చేయడమే కాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ఒకేచోట విత్తన పరిశోధన సంస్థలు, విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు, అధునాతన విత్తన పరీక్ష ప్రయోగశాలలు, శీతల గిడ్డoగులు, గోదాములు, శిక్షణ కేంద్రాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి విత్తన కంపెనీలు ఉన్నాయని చెప్పారు. VOICE OVER - 2 ఫుడ్ - ప్రాసెసింగ్ రంగంలో జర్మనీ అవలంభిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల విషయంలో తెలంగాణకు సహకారం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన వినతిపై జర్మనీ సానుకూలంగా స్పందించి సంసిద్ధత వ్యక్తం చేసింది. తమ ఆహ్వానాన్ని మన్నించి జర్మనీ పర్యటనకు విచ్చేసినందుకు జర్మనీ వ్యవసాయ మంత్రిత్వ బృందం ధన్యవాదాలు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విత్తన రంగ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. తెలంగాణ విత్తన రంగంపై అధ్యయనంచేసిన జర్మన్ పార్లమెంటరీ స్టేట్ సెక్రెటరీ మైకేల్ స్టూబ్ గన్‌కు మంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.