ETV Bharat / city

Telangana Voter List: రాష్ట్రంలో తుది దశకు ఓటర్ల జాబితా సవరణ - తెలంగాణ ఓటర్ల జాబితా సవరణ వార్తలు

Telangana Voter List:రాష్ట్రంలో మరో రెండు లక్షల మందికి కొత్తగా ఓటు హక్కు లభించనుంది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం తుదిదశకు చేరుకుంది. దరఖాస్తులన్నింటినీ పరిష్కరించి వచ్చే నెల ఐదో తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు. మొదటి సారి ఓటుహక్కు పొందనున్న వారికి ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా ఇళ్ల వద్దకే పంపించనుంది.

Telangana Voter List
Telangana Voter List
author img

By

Published : Dec 24, 2021, 5:58 AM IST

Telangana Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం తుది దశకు చేరుకొంది. 2022 జనవరి ఒకటి అర్హత తేదీతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటింటి పరిశీలన సహా ఇతరాత్ర ప్రక్రియలను పూర్తి చేసి నవంబర్ ఒకటో తేదీన ముసాయిదా జాబితా ప్రకటించారు. ఈసీ ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం... రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3 కోట్ల 3 లక్షల 56 వేల 665. అందులో పురుషులు కోటి 52 లక్షలా 57వేలా 690 మంది కాగా... మహిళల సంఖ్య కోటి 50 లక్షల 97వేల 292. ఇతరులు 1683 మంది ఈ జాబితాలో ఉన్నారు. ముసాయిదాపై నవంబర్ ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు వినతులు, అభ్యంతరాలు స్వీకరించారు.

తుది దశకు పరిశీలన..

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా మొత్తం 6 లక్షల 75 వేల 790 దరఖాస్తులు వచ్చాయి. అందులో కొత్తగా ఓటుహక్కు కోసం వచ్చిన దరఖాస్తులు 2 లక్షల 51 వేల599. మిగతావి చిరునామా మార్పు, తొలగింపులు సహా ఇతరాత్ర ఉన్నాయి. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన తుదిదశకు చేరుకొంది.

రెండు లక్షలు దాటే అవకాశం..

ఈసీ ఆదేశాల ప్రకారం ఈనెల 20వ తేదీ వరకు పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది. రాష్ట్రంలో మరో వారం రోజులు అదనంగా ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం ఇచ్చారు. కొత్త ఓటు హక్కు కోసం వచ్చిన లక్ష 87 వేల 817 దరఖాస్తులను ఆమోదించారు. 36 వేల 576 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 27 వేల 395 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రక్రియను మరో మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారు. మొత్తంగా కొత్తగా ఓటుహక్కు వచ్చే వారి సంఖ్య రెండు లక్షలు దాటే అవకాశం కనిపిస్తోంది. జనవరి ఐదో తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు.

ఇదీచూడండి: First case at IAMC: ఐఏఎంసీలో మొదటి కేసుగా పదమూడేళ్ల వివాదం.. ఎవరిదంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.