ETV Bharat / city

ACHARYA TEAM: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న 'ఆచార్య' చిత్రబృందం ​ - విజయవాడలో ఆచార్య చిత్ర బృందం

ACHARYA TEAM: ఆచార్య సినిమా విడుదలను పురస్కరించుకుని సినీనటుడు రామ్‌చరణ్‌, దర్శకుడు కొరటాల శివ తదితరులు ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో భ్రమరాంబ, ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో చిత్రబృందానికి స్వాగతం పలికారు. అమ్మవారికి రామ్‌చరణ్‌ పసుపు, కుంకుమ, చీర మొదలైనవి సమర్పించారు.

ACHARYA TEAM: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న 'ఆచార్య' చిత్రబృందం ​

author img

By

Published : Apr 27, 2022, 3:23 PM IST

ACHARYA TEAM: మెగాస్టార్ చిరంజీవి, రామ్​చర్​ణ్ కథానాయకులుగా నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర విడుదలను పురస్కరించుకొని హీరో రామ్​చరణ్​, దర్శకుడు కొరటాల శివ తదితరులు ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో భ్రమరాంబ, ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో చిత్ర బృందానికి స్వాగతం పలికారు. అమ్మవారికి రామ్‌చరణ్‌ పసుపు, కుంకుమ, చీర మొదలైనవి సమర్పించారు.

ACHARYA TEAM: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న 'ఆచార్య' చిత్రబృందం ​

తరలివచ్చిన అభిమానులు..: ఉదయం 11 గంటల తర్వాత చిత్ర బృందం ఆలయానికి చేరుకుంది. చరణ్​ వస్తున్నారన్న విషయం తెలుసుకుని అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులు.. ఆలయ ప్రాంగణంలో జై చరణ్‌ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అమ్మవారి సన్నిధిలో దుర్గమ్మ నామస్మరణ తప్ప వేరే ఏమీ చేయకూడదని ఆలయ సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా.. ఎవరూ వినిపించుకోలేదు. చరణ్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో వారిని నియంత్రించడం భద్రతా సిబ్బందికి కష్టతరమైంది. పోలీసులు, ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని పక్కకు తోసేసి మరీ అభిమానులు ఆలయం లోపలికి దూసుకెళ్లారు. పోలీసులు, ఆలయ సిబ్బంది, బౌన్సర్ల భద్రతతో అతి కష్టం మీద రామ్‌చరణ్‌, కొరటాల శివ ఆలయంలోకి ప్రవేశించారు.

అంతరాలయంలో చరణ్‌ దర్శనం చేసుకుంటున్న సమయంలో అభిమానులు ఆలయంలో నుంచి సెల్‌ఫోన్లతో దృశ్యాలు చిత్రీకరించడంతో పోలీసులు ఒక దశలో ఆలయ తలుపులు మూసేసే ప్రయత్నం చేశారు. అమ్మవారి మూల విరాట్​ను ఎవరూ ఫొటోలు, వీడియోలు తీయరాదంటూ ఈవో జోక్యం చేసుకుని భద్రతా సిబ్బంది సహాయంతో సెల్‌ఫోన్లలో చిత్రీకరణను నిలిపి వేయించారు. కొన్ని ఫోన్లలో చిత్రీకరించిన దృశ్యాలను తొలగింపజేశారు.

ఆశీర్వచన మండపానికి చేరుకోలేకపోయిన చిత్రబృందం..

అమ్మవారి దర్శనానికి ప్రముఖులు ఎవరొచ్చినా.. వారికి వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వడం ఆనవాయితీ. అయితే అభిమానుల తాకిడి అధికంగా ఉండటంతో చిత్రబృందం మండపం వద్దకు రాలేదు. అంతరాలయం లోపలే అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. అభిమానుల రద్దీకి రెయిలింగ్‌ కొంత పక్కకు జరిగింది.

ఇవీ చదవండి..

Acharya First review: మెగాఫ్యాన్స్​కు పూనకాలే.. ఫుల్​ మాస్​ మసాలా!

మా కుటుంబం అలా కావాలనేదే నా కోరిక: చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.