ఏపీ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో షూటింగ్‌ను చూసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు చిత్రీకరణ ప్రాంతానికి చేరుకున్నారు.
అభిమానులతో కలిసి చిరంజీవి, రామ్ చరణ్ సందడి చేశారు. కొణిదెల ప్రొడక్షన్ మ్యాట్నీ మూవీస్ పతాకంపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది చదవండి: 'మోసగాళ్లు' ట్రైలర్.. లిరికల్ గీతంతో సాయిపల్లవి