రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా అనుబంధ కళాశాలల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 161 ఇంజినీరింగ్ కళాశాలల్లో 85,149 సీట్లకు అనుమతి లభించింది. కన్వీనర్ కోటాలో 60,697 ఇంజినీరింగ్ సీట్లు భర్తీ కానున్నాయి. 91 కళాశాలల్లో 7,640 బి-ఫార్మసీ సీట్లకు అనుమతి వచ్చింది. కన్వీనర్ కోటాలో 2,691 బి-ఫార్మసీ సీట్లు భర్తీ కానున్నాయి. రాష్ట్రంలో 44 కళాశాలల్లో 1,295 ఫార్మ్-డి సీట్లకు అనుమతి లభించింది. కన్వీనర్ కోటాలో 454 ఫార్మ్-డి సీట్లు భర్తీ కానున్నాయి. రేపట్నుంచి ఈనెల 16 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మరోవైపు ధ్రువపత్రాల పరిశీలన రేపు ముగియనుంది. నేటి వరకు 59,901 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కడుపు కోత.. కుమారుడి చితికి తలకొరివి పెట్టిన తల్లి.!