ఈఎస్‌ఐ స్కామ్ వ్యవహారం.. ఇప్పుడు ఏపీ సచివాలయ ఉద్యోగులకు చుట్టుకుంటోంది. ఈ కుంభకోణంలో కొందరిని ప్రశ్నించేందుకు అవినీతి నిరోధక శాఖ సిద్ధమవుతోంది. 2014 - 19 మధ్య ఐఎంఎస్ డైరెక్టర్లుగా పనిచేసిన వారు ఆర్థికశాఖ అనుమతి, బడ్జెట్ రిలీజ్ ఆర్డరు లేకుండా.. వర్క్ ఆర్డర్లు, కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్లు అనిశా తేల్చింది. ఈ వ్యవహారంలో కొంతమంది సచివాలయ ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఓపెన్ టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ దానిని పాటించలేదని అనిశా గుర్తించింది. ఈ వ్యవహారంలో సచివాలయ ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తోంది.
డీఐఎంఎస్ నుంచి వచ్చిన దస్త్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిసినప్పటికీ ఎందుకు ఆమోదించాల్సి వచ్చింది? అనే కోణంలో వారిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకూ ఏడుగుర్ని అరెస్టు చేశారు. మొత్తం 19 మంది ప్రమేయాన్ని గుర్తించారు. అరెస్టైన వారిలో కొంతమందిని విచారించేందుకు వీలుగా అనిశా సోమవారం కస్టడీ పిటిషన్లు దాఖలు చేయనుంది.
ఇవీ చూడండి: దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి