ఈఎస్ఐ ఔషధ కొనుగోళ్లలో గోల్మాల్ వ్యవహారంలో అనిశా దూకుడు పెంచింది. చంచల్గూడ జైల్ నుంచి నిందితులను అనిశా ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ జరుపుతున్నారు. సంస్థ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మరో ఆరుగురిపై అనిశా అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మందు కొనుగోళ్లు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇండెంట్లు ఉండటంపై విచారణ జరుపుతున్నారు. 2014 నుంచి మొన్నటి వరకూ కొనుగోలు చేసిన మందులు, పరికరాల వివరాలపై ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా దేవికా రాణి తో పాటు మిగిలిన వారి బ్యాంక్ ఖాతాలను కూడా తనిఖీ చేస్తున్నారు.
ఏడుగురు నిందితుల కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. సాయంత్రం వీరికి వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు. విచారణలో వచ్చిన సమాధానాలను విశ్లేషించాకా.. ఈ స్కాంలో మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.
- ఇదీ చూడండి : ఈఎస్ఐ ఔషధ కుంభకోణం@13 మంది అరెస్టు