ETV Bharat / city

ఈఎస్​ఐ నిందితుల కస్టడీ పిటిషన్​పై రేపు అనిశా కోర్టు తీర్పు - ఈఎస్​ఐ నిందితులు

ఈఎస్​ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణం
author img

By

Published : Oct 4, 2019, 12:34 PM IST

Updated : Oct 4, 2019, 1:13 PM IST

12:20 October 04

ఈఎస్​ఐ నిందితుల బెయిల్​ పిటిషన్​ ఈనెల 9కి వాయిదా

    ఈఎస్​ఐ మందు కొనుగోళ్ల కుంభకోణం కేసులో నిందితుల కస్టడీపై అనిశా న్యాయస్థానం రేపు తీర్పు వెలువరించనుంది. నిందితులను కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అనిశా అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు...  ఈ కేసును మూడు సంవత్సరాల నుంచి విజిలెన్స్ దర్యాప్తు చేసిందని , ఇప్పుడు మళ్లీ కస్టడీకి అవసరం లేదని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. కస్టడీలోకి తీసుకుకోవాలంటే సరైన ఆధారాలు చూపించాలని కోరారు. కస్టడీ పిటిషన్ కొట్టివేసి నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న అనిశా కోర్టు బెయిల్​ పిటిషన్​ను ఈనెల 9కి వాయిదా వేసింది.  కస్టడీ పిటిషన్​పై రేపు తీర్పు వెలువరించనుంది. 

Last Updated : Oct 4, 2019, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.