Ramoji Foundation: సామాజిక బాధ్యతలో భాగంగా రామోజీ ఫౌండేషన్ మరో అడుగు ముందుకు వేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో అధునాతన హంగులతో పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించింది. దాదాపు 3 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. 9వేల చదరపుటడుగులకు పైగా విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ పద్దతిలో భవనాన్ని నిర్మించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఫిలింసిటీ డైరెక్టర్ శివరామకృష్ణ, రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే నూతన భవనాన్ని అందుబాటులోకి తెచ్చిన రామోజీ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సేవలను హోంమంత్రి కొనియాడారు
"అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌ను ఇంత చక్కగా నిర్మించిన రామోజీ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు. శంకుస్థాపన చేసిన సంవత్సర కాలంలో అద్భుతంగా నిర్మించి ఇవ్వటం గొప్ప విషయం. రామోజీ ఫౌండేషన్ తన వంతు సామాజిక బాధ్యతగా.. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆ సంస్థ ఎండీ విజయేశ్వరిని అభినందిస్తున్నాను. కొత్త పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా.. పోలీసులందరికీ శుభాకాంక్షలు." - మహమూద్ అలీ, హోంమంత్రి
ఇవీ చూడండి: