ETV Bharat / city

లాక్​డౌన్​ ఉన్నా.. మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటాడు..!

లాక్​డౌన్​ నిబంధన అమల్లో ఉన్నా.. ఓ యువకుడు మూడు రాష్ట్రాలను దాటి తన సొంతూరికి చేరుకున్నాడు. మహారాష్ట్రలో పనిచేస్తున్న సదరు యువకుడు ఏపీకి రావడంపై అక్కడి అధికారులు విస్మయానికి గురయ్యారు. కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్​కు తరలించారు.

a-young-man-lock-down-break-in-guntur
లాక్​డౌన్​ ఉన్నా.. మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటాడు..!
author img

By

Published : Apr 27, 2020, 11:39 PM IST

మహారాష్ట్రలో పనిచేస్తున్న యువకుడు మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు రావడం కలకలం రేపింది. గుంటూరు నగరంలోని బ్రాడిపేటకు చెందిన ఓ యువకుడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. లాక్​డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు లేక అక్కడి నుంచి వచ్చే వీలు లేకుండా పోయింది. తాను పనిచేస్తున్న సంస్థకు చెందిన కంటైనర్ హైదరాబాద్ వస్తుండటంతో ఆ వాహనంలోనే సొంతూరుకు చేరుకున్నాడు.

హైదరాబాద్ నుంచి వేరే రవాణా వాహనంలో విజయవాడకు చేరుకున్నాడు. గుంటూరు నుంచి ద్విచక్ర వాహనం తెప్పించుకుని.. దానిపై బ్రాడిపేటలోని తన ఇంటికి చేరుకున్నాడు. అయితే పొరుగు వారి ద్వారా విషయం వార్డు వాలంటీర్లకు తెలిసింది. వారు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే యువకుని ఇంటికి చేరుకున్న అధికారులు, వైద్య సిబ్బంది అతనికి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్​కు తరలించారు. లాక్​డౌన్ నిబంధనలు ఉన్నా.. మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి యువకుడు రావడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: ఉపాధి హామీ కూలీల వేతనం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.