ప్రయాణిస్తున్న రైల్లో మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు (Rape victim news). ఇతర ప్రయాణికులు చూస్తుండగానే దారుణానికి తెగబడ్డాడు. వీరంతా చూస్తూ ఉండిపోయారే తప్ప.. ఏమీ చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. అమెరికా ఫిలడెల్ఫియాలోని (Philadelphia news) అప్పర్ డార్బి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
రైలులో అనుమానాస్పద పరిస్థితులను గమనించి స్థానిక రైల్వే ఉద్యోగి పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు తర్వాతి స్టేషన్లో వేచి చూశారు. మహిళను కాపాడి, నిందితుడిని అరెస్టు చేశారు. బుధవారం రాత్రి పది గంటలకు తమకు ఘటన గురించి సమాచారం అందిందని స్థానిక పోలీసు అధికారి తిమోతీ బెర్నార్డ్ తెలిపారు. (USA Philadelphia news)
"అక్కడ చాలా మంది ఉన్నారు. వారు ఈ ఘటనను అడ్డుకుంటే బాగుండేది. ఏదైనా చేసి ఉండాల్సింది. మనం సమాజంలో ఏ స్థితిలో ఉన్నామనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఇది చాలా ఇబ్బందికరమైనది. బాధిత మహిళ చాలా దృఢమైన వ్యక్తి. ఆమె.. పోలీసులకు మొత్తం వివరాలు చెప్పారు. ఆమె త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నా."
-తిమోతీ బెర్నార్డ్, పోలీసు అధికారి
ఘటన పూర్తిగా సీసీటీవీలో రికార్డైందని తిమోతీ తెలిపారు. చాలా మంది ప్రయాణికులు ఉన్నట్లు ఇందులో స్పష్టమవుతోందని చెప్పారు. నిందితుడిని ఫిస్టన్ నగాయ్(35)గా గుర్తించారు.
ఘటనపై ఆగ్నేయ పెన్సిల్వేనియా రవాణా సంస్థ విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికుల్లో ఎవరైనా.. ముందుగానే పోలీసులకు సమాచారం అందించి ఉంటే ఘటనను ఆపే అవకాశం ఉండేదని అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: