సృష్టిలో అమ్మ స్థానం కంటే గొప్పది లేదు. తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. నవమోసాలు మోసిన తల్లి బిడ్డ పుట్టిన క్షణం నుంచి అపురూపంగా చూసుకుంటుంది. పసిబిడ్డ ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డేస్తుంది. తన చిన్నారికి ఏ చిన్ని కష్టం రాకుండా కాపాడుకుంటుంది. బిడ్డ క్షేమం కోసం ప్రతిక్షణం తపిస్తుంది. తన పిల్లలు ఆనందంగా ఉండాలని అనుక్షణం శ్రమిస్తుంది. బిడ్డకు ఏం కావాలో అడక్కుండానే ముందే తెలుసుకుని అన్నీ ఇస్తుంది. అంత మహోన్నతమైన స్థానం కలిగిన అమ్మతనానికి మచ్చ తెచ్చింది ఓ మహిళ. కంటికి రెప్పలా చూస్కోవాల్సిన కన్నబిడ్డను అంగట్లో బొమ్మను చేసింది. తన అవసరాల కోసం చంటిపాపను వాడుకుంటోంది.
చేతికి గాయం మరకలు.. నీరసించిన స్థితిలో పడిపోయి ఉన్న తల్లి.. పక్కనే బిక్కచూపులు చూస్తూ ఓ చిన్నారి. ఈ చిత్రం చూసిన ఎవరికైనా కళ్లుచెమర్చక మానదు. ఇది ఆ ఇద్దరి విధిరాత కాదు. మత్తు మహమ్మారి రాసిన ఓ 'వీధి'రాత. తన అలవాట్లు తీర్చుకునేందుకు ఈ చిన్నారిని అంగడి బొమ్మను చేసిందా అమ్మ! రెండేళ్లుగా ఆ చిన్నారిని ఇలాగే వాడుకుంటోందా తల్లి. ఏటా ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనాల సమయంలో ఇలాగే దర్శనమిస్తోంది. 2019 సెప్టెంబరు 12న నిమజ్జనాల వేళ ఆమెపై పలు ఫిర్యాదులొస్తే అదుపులోని తీసుకొని సంరక్షణ కేంద్రానికి తరలించారు. రెండేళ్ల తర్వాత ఆదివారం మళ్లీ దర్శనమిచ్చింది. ఆమె చేతిపై ఉన్న మరకలు పెయింటింగ్.
ఇవీ చదవండి :
డబ్బులు ఇవ్వాలంటూ కుమారుడి వేధింపులు.. ఠాణాకొచ్చిన వృద్ధురాలు