ETV Bharat / city

స్వదేశం వెళ్లేందుకు ఎల్‌జీ ప్రమాద దర్యాప్తు బృందం యత్నం...

author img

By

Published : May 27, 2020, 9:50 AM IST

ఏపీలోని విశాఖ ఎల్​జీ పాలిమర్స్‌ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు వచ్చిన దక్షిణ కొరియా నిపుణుల బృందం.. తమ స్వదేశానికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. వీరి ప్రయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు... వారిని విమానాశ్రయంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వారు బస చేస్తున్న హోటల్‌కు తిరిగి పంపి అక్కడ బందోబస్తు పటిష్ఠం చేశారు.

a teamm of exports in lg polymers issue
స్వదేశం వెళ్లేందుకు ఎల్‌జీ ప్రమాద దర్యాప్తు బృందం యత్నం...స్వదేశం వెళ్లేందుకు ఎల్‌జీ ప్రమాద దర్యాప్తు బృందం యత్నం...

ఏపీలోని విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్‌ లీకేజికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి దక్షిణ కొరియా నుంచి విశాఖ వచ్చిన ఆ సంస్థ సాంకేతిక నిపుణులలో కొందరు మంగళవారం స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రమాదం అనంతరం వీరు భారత ప్రభుత్వ అనుమతితో దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చారు. ప్రమాద కారణాలపై పరిశ్రమలో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈ బృందం నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇంతలో సంస్థ అవసరాల రీత్యా ఒకరు అత్యవసరంగా విశాఖ నుంచి దక్షిణ కొరియా వెళ్లడానికి అనుమతి తీసుకున్నారు.

ఆయనను విమానాశ్రయంలో దించడానికి వచ్చిన మరో ఏడుగురు నిపుణులు కూడా దక్షిణకొరియా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు విమానాశ్రయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ముగ్గురు కొరియన్లు విమానాశ్రయంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు. మరికొందరు ఇంకో కారులో వేచి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురు తమ సూట్‌కేసులు, బ్యాగులతో వచ్చిన దృశ్యాలు విమానాశ్రయ సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ఎలా వెళ్లేవారో?

ఒక్కరికే అనుమతి తీసుకుని ఏడుగురు విశాఖ నుంచి వెళ్లిపోవడానికి ఎలా ప్రయత్నించారన్నది పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారికి ఎవరైనా సహకరిస్తున్నారా? అన్న కోణంలో కూపీ లాగుతున్నారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వకుండానే వెళ్లిపోవడానికి ప్రయత్నించడం వెనక ఆంతర్యం ఏమిటో కూడా పోలీసులకు అర్థం కావడం లేదు. ఎల్‌జీ నిపుణులు విమానాశ్రయం నుంచి తిరిగి నగరంలో తాము బస చేస్తున్న హోటల్‌కు వచ్చేశారు. డీసీపీ-2 ఉదయభాస్కర్‌ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు వెళ్లి వారిని విచారించారు. హోటల్‌ వద్ద ఒక ఏసీపీ స్థాయి అధికారి, పలువురు పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఎల్‌జీ పాలిమర్స్‌పై ఎన్జీటీలో కేసు

విశాఖ నగరంలో సంభవించిన ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకు సంఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)లో నగరానికి చెందిన పర్యావరణవేత్త, మాజీ ఐఏఎస్‌ అధికారి ఇ.ఎ.ఎస్‌.శర్మ కేసు దాఖలు చేశారు. వివాదంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ఎల్‌జీ పాలిమర్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇవీ చూడండి: కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.