పెరిగిన పెట్రోలు ధరలకు ప్రత్యామ్నాయం ఆలోచించాడు ఆంధ్రప్రదేశ్లోని రాయదుర్గానికి చెందిన వ్యక్తి. జట్కాను తయారు చేసి గాడిదతో నడుపుతున్నాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన సురేష్ కోటలో నివాసం ఉంటున్నాడు. రజక వృత్తి చేసుకుంటూ... కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
నిత్యం దుస్తులు ఉతికేందుకు ద్విచక్ర వాహనంపై 4 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేదని, పెట్రోలు ధరలు పెరగడంతో మరో మార్గాన్ని ఆలోచించినట్లు పేర్కొన్నారు. రూ.10 వేలు ఖర్చు చేసి జట్కా తయారు చేయించి తన వద్ద ఉన్న గాడిదతో నడపుతున్నట్లు తెలిపాడు.
ఇదీ చదవండి: Corona: నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు.. పట్టించుకోని అధికారులు