Girl Raped By Father, Brother: మహారాష్ట్రలో అమానవీయ ఘటన జరిగింది. వావివరుసలు మరిచి ప్రవర్తించారు ఆ కుటుంబంలోని వ్యక్తులు. సొంత అన్న, తండ్రే వేర్వేరు సమయాల్లో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాక తాత, మామ కూడా చిన్నారిని లైంగికంగా వేధించేవారని పోలీసులు తెలిపారు. ఇలా ఐదేళ్లుగా బాలిక లైంగిక వేధింపులను అనుభవిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై వివిధ సెక్షన్ల కింద పుణెలోని బుంద్ గార్డెన్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు.
బాధితురాలు, ఆమె కుటుంబం బిహార్ నుంచి మహారాష్ట్రలోని పుణెకు వలస వచ్చింది. తన పాఠశాలలో జరిగిన 'గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్' అనే కార్యక్రమంలో బాలిక ఈ విషయాలను వెల్లడించినట్లు ఎస్సై అశ్విని సాత్పుతె తెలిపారు. ఐదేళ్లుగా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు బాలిక చెప్పిందన్నారు. 2017 నుంచి చిన్నారి తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా.. 2020లో బాలిక సోదరుడు సైతం వేధింపులకు గురిచేసినట్లు తేలిందన్నారు.
బాలికపై లైంగిక దాడులన్నీ వేర్వేరుగా జరిగాయని.. ఇది గ్యాంగ్‌రేప్ కాదని అన్నారు ఎస్సై అశ్విని. నిందితులపై పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
యువతిపై గ్యాంగ్ రేప్..
ఉత్తర్‌ప్రదేశ్ బాగ్‌పత్‌లో మరో నిర్భయ ఘటన వెలుగులోకి వచ్చింది. బాగ్పత్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతిని.. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను ఓ గుడిసెలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఒకరిని అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిపారు.
నాలుగేళ్ల చిన్నారిపై..
మధ్యప్రదేశ్‌లోని మందసుర్ జిల్లా దొదియా మీన గ్రామంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి కిరాతకంగా చంపేశారు కొందరు దుండగులు. బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు.. రిపోర్టును భద్రపరిచారు. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు మందసుర్ పోలీస్ అధికారి లక్ష్మీ సిసోడియా తెలిపారు.
ఇదీ చూడండి: డాక్టర్ 'సరోగసి' చీటింగ్.. హైదరాబాద్ దంపతులకు టోకరా!