ఏపీ విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని ముత్యాలమ్మపాలెం తీరంలో మత్స్యకారులకు 30 అడుగుల భారీ తిమింగలం చిక్కింది. పరవాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన జాలర్లు తంతడిపాలెం సమీపంలో వేట కొనసాగిస్తుండగా... వలలో తిమింగలం పడింది. భారీ మెుత్తంలో చేపలు పడ్డాయని... వలను తీరానికి లాక్కొని రాగా తిమింగలం కనిపించింది.
ప్రాణాలతో ఉండటాన్ని గమనించి... తిరిగి సముద్రం లోపలకు వదిలేశారు. ఇలా తిమింగలాలు వలలకు చిక్కుడానికి... రసాయన వ్యర్థాలను సముద్రంలో వదిలేస్తుండటమే కారణమని మత్స్యకారులు అంటున్నారు.
ఇదీ చదవండి: Treatment to Cobra: నాగుపాముకి శస్త్ర చికిత్స... ఎందుకో తెలుసా.?