ETV Bharat / city

విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్న భారీ కార్గో నౌక

author img

By

Published : Nov 30, 2020, 4:32 PM IST

ఏపీలోని విశాఖ నౌకాశ్రయంలో భారీ కార్గో నౌక సందడి చేసింది. దాదాపు 90వేల టన్నుల లోడ్​తో ​ఎంటీ ఓస్లో అనే కార్గో నౌక నాన్ కుకింగ్ కోల్, స్టీమ్ కోల్​తో సాగర తీరానికి వచ్చింది.

విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్న భారీ కార్గో నౌక
విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్న భారీ కార్గో నౌక

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స‌హ‌జ ‌నౌకాశ్రయానికి అతి పెద్ద నౌక ‌వచ్చింది. దాదాపు 90 వేల ట‌న్నుల లోడ్​తో విశాఖ నౌకాశ్రయానికి ఈ నౌక చేరుకుంది. ఎంటీ ఓస్లో అనే కార్గోనౌక నాన్ కుకింగ్ కోల్, స్టీమ్ కోల్​తో వ‌చ్చింది. ఇటీవలే సింగ‌పూర్​కి చెందిన సంస్ధ భారీ నౌక‌లు విశాఖకు రావ‌డానికి ఉన్న అవ‌కాశాల‌ను.. సాంకేతిక వెసులుబాటు‌పై స్టిమ్యూలేష‌న్ స్టడీ చేసింది. ఈ స్ట‌డీ త‌ర్వాత భారీ నౌక‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉన్న‌ట్టు నిర్ధరించింది. వీటి త‌ర్వాత తొలిసారిగా విశాఖకు ఈ భారీ నౌక రావటంతో....పోర్టు వర్గాల్లో ఆనందం నెలకొంది.

కెప్టెన్ శ‌ర్మ నేతృత్వంలో ఇన్న‌ర్ హార్బ‌ర్​లోని ఈక్యూ 7 బెర్త్ వద్ద అన్ లోడింగ్ జ‌రుగుతోంది. 229.20 మీట‌ర్ల పొడ‌వు, 38 మీట‌ర్ల వెడ‌ల్పు ఉన్న ఇంత‌టి భారీ నౌక ఇన్నర్ హార్బ‌ర్​లోకి తొలిసారి వ‌చ్చింద‌ని పోర్టు వ‌ర్గాలు తెలిపాయి. ఇందులో మొత్తం 87వేల 529 మెట్రిక్ ట‌న్నుల లోడ్ ఉంద‌ని వెల్ల‌డించింది.

ఇదీ చదవండి: నేను భాజపాలో చేరుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: హరీశ్‌రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.