ETV Bharat / city

ఉక్రెయిన్ నుంచి సొంతూళ్లకు విద్యార్థులు... ఆనందంలో ఆత్మీయులు

AP Students Reached from Ukraine : ఉక్రెయిన్​లో చిక్కుకున్న మరికొంత మంది ఏపీ విద్యార్థులు క్షేమంగా వచ్చారు. దిల్లీ, బెంగళూరు మీదుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 21 మంది విద్యార్థులు చేరుకున్నారు. సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు తనకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

AP Students Reached from Ukraine , andhra pradesh students
ఉక్రెయిన్ నుంచి క్రమక్రమంగా సొంతూళ్ళకు విద్యార్థులు... ఆనందంలో ఆత్మీయులు
author img

By

Published : Mar 6, 2022, 5:21 PM IST

AP Students Reached from Ukraine : ఉక్రెయిన్​లో చిక్కుకున్న మరికొంత మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు క్షేమంగా రాష్ట్రానికి వచ్చారు. దిల్లీ, బెంగళూరు మీదుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 21 మంది విద్యార్థులు చేరుకున్నారు. విద్యార్థులంతా ఉక్రెయిన్ లోని జాపోరిజ్జియా స్టేట్ వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన వారిగా గుర్తించారు. విమానాశ్రయంలో విద్యార్థులకు తల్లిదండ్రులతో కలిసి రెవెన్యూ, ఇంటెలిజెన్స్ సిబ్బంది, భాజాపా నేతలు స్వాగతం పలికారు. దగ్గరుండి సొంతూళ్లకు వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

సరిహద్దు చేరుకునేందుకు..

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవడం పట్ల వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని అక్కయ్యపాలానికి చెందిన కవిత... క్షేమంగా స్వస్థలానికి చేరుకున్నారు. ఎంబీఏ చదివేందుకు ఉక్రెయిన్‌ వెళ్లిన విద్యార్థిని కవిత... సరిహద్దు చేరుకునేందుకు ఇబ్బందులు పడినట్లు తెలిపారు. సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు తనకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కవిత కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్యేక విమానంలో..

కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన విద్యార్థుల్లో నలుగురు... సురక్షితంగా నగరానికి చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చి.. అనంతరం స్వస్థలాలకు చేరుకున్నారు. మండవల్లి మండలం అప్పాపురానికి చెందిన వైద్య విద్యార్థి చావలి వెంకట కృష్ణ చైతన్య ఇంటికి చేరుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డకు చెందిన వైద్య విద్యార్థి నల్లపాటి ప్రేమ్ కుమార్ సైతం... క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు. తమ పిల్లలు ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. స్వస్థలాలకు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషిని మరువలేమని విద్యార్థులు అన్నారు.

మేము ఉండే దగ్గర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మాకు 2.5 కిలోమీటర్ల దూరంలో ఫిబ్రవరి 27న బాంబు పేలింది. ఫిబ్రవరి 28న మేం బయల్దేరాం. సరిహద్దుల్లో రెండు రోజులు ఉన్నాం. రొమేనియాకు చేరుకున్నాం. అక్కడికి ఎంబసీ వాళ్లు వచ్చారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేశాయి. మేం సురక్షితంగా ఇండియాకు చేరుకున్నాం. కేంద్రప్రభుత్వం, ఏపీ గవర్నమెంట్​కు ధన్యవాదాలు. అక్కడ ఉన్న మిగతా విద్యార్థులను కూడా క్షేమంగా తీసుకొస్తారని ఆశిస్తున్నాం.

-ప్రేమ్ కుమార్, ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థి

ఫిబ్రవరి 24న పెద్ద బాంబు బ్లాస్ట్ జరిగింది. మేం వెంటనే ఫ్రెండ్ కారు తీసుకొని బయల్దేరాం. మధ్యలో హెవీ ట్రాఫిక్ జామ్ అయింది. కారు అక్కడే వదిలేసి నడిచాం. అక్కడి నుంచి పోలాండ్ బార్డర్​కు చేరుకున్నాం. మాకు ఫుడ్, వాటర్ లేదు. షెల్టర్ లేదు. గడ్డకట్టుకుపోయే చలి ఉంది. పోలాండ్ సరిహద్దు దాటాకా ఇండియన్ ఎంబసీ వాళ్లు కలిశారు. మేం సురక్షితంగా ఇండియాకు వచ్చాం.

-కవిత, ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థి

ఉక్రెయిన్ నుంచి క్రమక్రమంగా సొంతూళ్ళకు విద్యార్థులు... ఆనందంలో ఆత్మీయులు

ఇదీ చదవండి: కేటీఆర్ అంకుల్.. ప్లీజ్.. రక్షించండి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.