ETV Bharat / city

సోనూసూద్​ను కలిసేందుకు అభిమాని ఆరాటం... - hyderabad latets news

తన అభిమాన నటున్ని కలిసేందుకు ఓ యువతి... నాగర్​కర్నూల్ నుంచి హైదరాబాద్​కు వచ్చింది.​ సేవాభావంతో ఆరాధ్యుడిగా మారిన సినీ నటుడు సోనూసూద్​ను కలిసేందుకు ఎన్నో ఆశలతో ఒంటరిగా ఎదురుచూస్తోంది. నటుడు సోనూసూద్​ను కలిసేదాకా ఇంటికి తిరిగి వెళ్లనని హైదరాబాద్ ట్యాంక్​బండ్ వద్ద భీష్మించుకుని కూర్చుంది. నటుడు సోనూసూద్​ను ఆ యువతి ఎందుకు కలవాలనుకుంది..? ఆ యువతి ఏం కోరుకుంటోంది...? ఆమె మాటల్లోనే విందాం...

a fan came to hyderabad to meet sonu sood from nagar kurnool

author img

By

Published : Jan 20, 2021, 5:03 PM IST

సోనూసూద్​ను కలిసేందుకు అభిమాని ఆరాటం...

కుటుంబ సమస్యలతో తనువు చాలిద్దామని నిర్ణయించుకున్న ఆ యువతి... చివరిసారిగా తన ఆవేదనను తన అభిమాన నటుడు సోనూసూద్​తో వెళ్లబోసుకుందామని నిశ్చయించుకుంది. హైదరాబాద్​లో ఉన్నాడని తెలియగానే... నాగర్​కర్నూల్​ నుంచి ఒంటరిగా వచ్చేసింది. ఎలాగైనా తనని కలవాలని... తనతో కాసేపు మాట్లాడలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. మనిషి రూపంలో ఉన్న దేవుడిగా సోనూసూద్​ను అభివర్ణిస్తున్న ఆ అభిమాని... ఆయన్ని కలవనిదే ఇంటికి వెళ్లనంటోంది.

ఈ క్రమంలో ఆమె అభ్యర్థనను అర్థం చేసుకున్న ఈటీవీ భారత్​... ఆ అభిమాని ఎవరి చేతుల్లో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంది. బర్న్​ టూ షైన్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, లేక్ వ్యూ పోలీసులకు సమాచారం అందించింది. బర్న్​ టూ షైన్ ఫౌండర్ నిహారి ఆ యువతిని చేరదీసి.. అల్పాహారం అందించి తన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుందని... చివరిసారిగా సోనూసూద్​ను కలిసి తన గోడు వెళ్లబోసుకుందామని నిర్ణయం తీసుకొని హైదరాబాద్​కు వచ్చిందని తెలుసుకున్నారు. నటుడు సోనూసూద్​తో మాట్లాడి ఆమెను కలిపించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అభిమాని ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో సోనూసూద్​ సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.