ETV Bharat / city

'న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం' - kadapa-district crime

ఏపీ కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లెలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మైదుకూరు గ్రామీణ సీఐ వేధిస్తున్నారని అక్బర్ బాషా కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు.

CDP
పోలీసులు
author img

By

Published : Sep 11, 2021, 2:26 PM IST

ఏపీ కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లెలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మైదుకూరు గ్రామీణ సీఐ వేధిస్తున్నారని అక్బర్ బాషా కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. న్యాయం జరగపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.

దువ్వూరు మండలానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తమ కుటుంబానికి చెందిన 1.5 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ సూచన మేరకు మైదుకూరు రూరల్ సీఐకి తమ సమస్యను వివరించారు. తన సమస్యను పరిష్కరించకుండా వైకాపా నేతకు అనుకూలంగా సీఐ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రూపొందించారు.

సీఐ కొండారెడ్డి, వైకాపా నాయకుడి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటిపర్యంతమయ్యారు. తన సమస్యపై ఏపీ సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

'న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం'

ఇదీ చూడండి: 34 ఏళ్ల మహిళపై అత్యాచారం.. ఆపై రాడ్​తో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.