చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంటైనర్ అతివేగంతో వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్‌తో పాటు 12 మంది మృతి చెందారు. బ్రేకులు విఫలమై ఆటో, ఓమ్ని వ్యాన్, ద్విచక్రవాహనంపైకి కంటైనర్ దూసుకెళ్లింది. క్షతగాత్రులను 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే చీకటి వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. బాధితులను గుర్తించేందుకు పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ప్రమాద స్థలాన్ని కలెక్టర్ భరత్ గుప్తా పరిశీలించారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది మృతి - బంగారుపాళ్యంలో రోడ్డు ప్రమాదం న్యూస్
చిత్తూరు జిల్లాలో ఓ కంటైనర్ బీభత్సం స్పష్టించింది. అతివేగంతో ఓమ్ని వ్యాన్, ద్విచక్రవాహనం, ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12మంది మృతి చెందారు.