ETV Bharat / city

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని విచారించిన ఈడీ

manchireddy kishanreddy
మంచిరెడ్డి కిషన్​రెడ్డి
author img

By

Published : Sep 27, 2022, 2:32 PM IST

Updated : Sep 28, 2022, 7:00 AM IST

14:29 September 27

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ

Manchireddy Kishanreddy On ED: నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు నిధులు మళ్లించారన్న ఆరోపణలపై ఇబ్రహీంపట్నం (తెరాస) ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు విచారించారు. మంగళవారం మద్యాహ్నం సమయంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయనను రాత్రి 9 గంటల వరకూ అధికారులు అనేక అంశాలపై ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ఆస్ట్రేలియా, సింగపూర్‌లకు నిదులు మళ్లించారన్న ఆరోపణలపైనే మంచిరెడ్డిని ఈడీ అధికారులు పిలిపించినట్లు తెలుస్తోంది.

ఒకపక్క దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ అధికారులు వరుసపెట్టి సోదాలు నిర్వహిస్తుండగా తాజాగా రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేని ఈడీ విచారించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఈడీ అధికారులు నిరాకరిస్తున్నారు. కేసు నమోదు కాలేదని, ప్రాథమిక దర్యాప్తులో భాగంగానే ఆయనను మౌఖికంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఇందులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా అవసరమైతే ఈడీ అదికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 28, 2022, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.