ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆలపాటి రాజేంద్రప్రసాద్ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ మంగళగిరి ఎన్నారై ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ ఉపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉపేంద్ర ఫిర్యాదుపై పోలీసులు 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆలపాటి రాజా సోదరుడు రవీంద్రను ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్స్‌లో డైరెక్టర్‌గా తిరిగి తీసుకోవాలంటూ బెదిరించారని.. తనతో దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.