ETV Bharat / city

ప్రమాదంలో విశాఖ రాతితోరణం - Natural rock arch in Vishakhapatnam news

సహజ సిద్ధంగా ఏర్పడిన ఆ రాతి ద్వారం.. సాగరానికి స్వాగతం పలుకుతుందా అన్నట్లు కనిపిస్తుంది. విశాఖ సాగర తీరంలో అత్యంత అరుదైన ఆ రాతితోరణం ఇప్పుడు ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. పర్యటకుల వ్యవహార శైలితో ఎంతో విశిష్ఠతను కలిగిన శిలా తోరణానికి పెద్ద ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

a-big-threat-to-the-natural-rock-arch-in-vizag-due-to-tourists
విశాఖ సాగర తీరంలోని అరుదైన రాతితోరణానికి ముప్పు
author img

By

Published : Jan 16, 2021, 9:00 AM IST

ఏపీలోని విశాఖ సాగర తీరం ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. తీరానికి సమాంతరంగా కనిపించే తూర్పు కనుమల సొబగులు మనసును కట్టిపడేస్తాయి. ఇసుక తిన్నెలపై కనిపించే రాతి దిబ్బలు రమణీయతకు మరింత సౌందర్యాన్ని జోడిస్తాయి. వీటితో పాటు మంగమారిపేటలోని తొట్లకొండ ఎదురుగా ఇసుక తిన్నెలపై కొలువైన సహజ శిలా తోరణం తీరానికి మరింత వన్నె తెచ్చిపెడుతోంది. రాతి తోరణం మధ్య నుంచి తెల్లటి నురగలతో చొచ్చుకు వచ్చే అలలను ఆస్వాదించడం ఓ గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతి అందాల సహజత్వం ఉట్టిపడే ఈ ప్రాంతం పర్యాటకంగాను ప్రత్యేకత సంతరించుకుంది.

విశాఖ సాగర తీరంలోని అరుదైన రాతితోరణానికి ముప్పు

సందర్శకుల అత్యుత్సాహం

సందర్శకుల తీరుతో.. శిలా తోరణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. భౌగోళిక స్వరూపం విలువను ఏ మాత్రం గుర్తించకుండా దానిపై నిలబడి ఫొటోలు దిగడం.. మరికొందరు దానిపై ద్విచక్రవాహనాలను నిలిపి..అత్యుత్సాహం ప్రదర్శించడం ఆందోళన కలిగిస్తోంది.

విరిగిపోయే అవకాశం

అలల తాకిడికి అక్కడి రాయి కరిగి..తోరణంగా ఏర్పడిందని.. బలహీనంగా ఉండే దీనిపై నిలబడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే విరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా శిలా తోరణం ప్రాధాన్యతను వివరిస్తూ బోర్డులను ఏర్పాటు చేయడం సహా... పర్యవేక్షణ ఉండేలా భద్రతా సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.