ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 9PM - ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS
author img

By

Published : Jun 16, 2022, 9:01 PM IST

  • రణరంగమైన ఛలో రాజ్​భవన్..

కాంగ్రెస్‌ చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సోనియా , రాహుల్‌గాంధీలను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ..ఏఐసీసీ పిలుపు మేరకు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 'నన్నే పట్టుకుంటావా.. స్టేషన్​కు వచ్చి మరీ కొడతా..'

రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై నిరసనగా రాష్ట్రంలో కాంగ్రెస్ తలపెట్టిన ఆందోళన రణరంగంలా మారింది. రాజ్​భవన్ ముట్టడించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. మాజీ మంత్రి రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

  • 'తెలంగాణ బిగ్ గ్రీన్‌స్పాట్‌గా మారింది'

తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఆశ్చర్యం కలిగిస్తోందని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్​ చూస్తుంటే అంతా పచ్చదనం పరిచినట్లుగా కనిపిస్తోందని తెలిపారు.

  • 'తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వెేయండి'

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. శుక్రవారం జరగాల్సిన విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరముందని లేఖ రాశారు.

  • 'అగ్నిపథ్'​పై ఉద్యోగార్థులు భగ్గు..

ఆర్మీ నియామకానికి సంబంధించిన నూతన విధానం 'అగ్నిపథ్'పై.. ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. బిహార్​లో రెండు రైళ్లు తగులబెట్టారు.

  • భారత్​లో మరోసారి పోలియో కలకలం..

భారత్​లో మరోసారి పోలియో వైరస్​ కలకలం సృష్టించింది. పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందిన ఎనిమిదేళ్ల తర్వాత బంగాల్​ రాజధాని కోల్​కతాలో ఈ వైరస్​ ఆనవాళ్లను గుర్తించారు. దీంతో అధికారులను అప్రమత్తం చేసింది కోల్​కతా మున్సిపల్​ కార్పొరేషన్​.

  • భారత్​లో పబ్​జీకి 'ఒలింపిక్స్' గుర్తింపు!.. నిజమెంత?

భారత్​లో విపరీతమైన ఆదరణ ఉన్న ఆన్​లైన్​ గేమ్​ పబ్​జీకి బానిసలుగా చాలా మంది మారిపోతున్నారు. ఆట మోజులో పడి కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. అందువల్లే కొన్నేళ్ల క్రితం భారత్..​ ఈ గేమ్​పై నిషేధం విధించింది.

  • దలాల్​ స్ట్రీట్​పై ఫెడ్​ దెబ్బ- సెన్సెక్స్​ 1000 మైనస్​

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, అమెరికా ఫెడరల్​ రిజర్వ్​​ వడ్డీ రేట్ల పెంపు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దేశీయంగా కరోనా కేసులు పెరగడమూ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించేందుకు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్​ ఏకంగా 1000కిపైగా పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 15,400 దిగువకు చేరింది.

  • అక్కడ లీటర్​ పెట్రోల్​ రూ.234, డీజిల్​ రూ.263

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​లో పెట్రోల్​ ధరలు భగ్గుమంటున్నాయి. ఇరవై రోజుల క్రితమే లీటర్​ పెట్రోల్​పై రూ.60 పెంచిన ప్రభుత్వం మరోసారి రూ.24 వడ్డించింది. దీంతో లీటర్​ పెట్రోల్​ రూ.234కు చేరింది. రాయితీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

  • రానా-సాయి పల్లవి 'విరాటపర్వం'.. ఈ విషయాలు తెలుసా?

రానా, సాయిపల్లవి నటించిన 'విరాటపర్వం' శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టికెట్‌ ధరల వివరాలు తెలియజేసింది. ఆ వివరాలతో పాటు సినిమా గురించి మరిన్ని విశేషాలు మీకోసం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.