రాష్ట్రంలో మరో 74 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. కరోనాతో మరో ఆరుగురు చనిపోయారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 41, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో ముగ్గురికి, మహబూబ్నగర్, జగిత్యాల జిల్లాల్లో ఇద్దరికి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్, వికారాబాద్, మేడ్చల్, నాగర్కర్నూల్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరి చొప్పన కరోనా కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో 9 మంది, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 2,499కి చేరాయి. ఆస్పత్రిలో చికిత్స నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,412 మంది డిశ్ఛార్జి అయ్యారు. మరో 1,010 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 77కి చేరింది.