ETV Bharat / city

ఒకే బండిపై ఏకంగా 69 చలానాలు - hyderabad traffic news

ఎదైనా అత్యవసరమైన పని ఉంటేనో... తొందరపాటులోనో సిగ్నల్​ జంప్​ చేయటం... మరిచిపోయి హెల్మెట్​ పెట్టుకోకపోవటం వంటి ఉల్లంఘనలు ఒకటి రెండు ఉంటే ఏమో అనుకోవచ్చు. కానీ.. ఓ ప్రబుద్ధుని బండిపై ఏకంగా 69 చలానాలు ఉన్నాయి. హైదరాబాద్​లోని సుల్తానాబాద్​లో ట్రాఫిక్​ పోలీసులకు దొరికాడు ఈ చలానాల ధీరుడు.

69 pending challans pending on scooty
69 pending challans pending on scooty
author img

By

Published : Jan 30, 2021, 10:21 AM IST

హైదరాబాద్​లోని వేర్వేరు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 69 పెండింగ్‌ చలానాలు ఉన్న ఓ ద్విచక్రవాహనదారుడు సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కాడు. ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిసున్నారు. ఇంతలో ద్విచక్రవాహనం(టీఎస్‌12ఈజీ- 8524)పై అటుగా వచ్చిన పాతబస్తీ మచలికమాన్‌ ప్రాంతానికి చెందిన రిషబ్‌గుప్తాను నిలిపారు.

69 pending challans pending on scooty
ఒకే బండిపై ఏకంగా 69 చలానాలు

వాహనం నంబర్​పై 69 చలానాలతో సుమారు రూ.21,270 పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ చలానాలకు సంబంధించి మొత్తం బిల్లును వాహనదారుడు చెల్లించగా... బండిని విడుదల చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌కుమార్‌ తెలిపారు.

ఇదీ చూడండి: కేసుల దర్యాప్తుల్లో 'నేను సైతం' అంటోన్న నిఘానేత్రాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.