ETV Bharat / city

ఏపీ పరిషత్​ ఎన్నికల్లో 60.78 శాతం పోలింగ్

ఏపీ పరిషత్ ఎన్నికల్లో 60.78 శాతం పోలింగ్ నమోదైందని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 68.27 శాతం నమోదవ్వగా.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 51.68 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు.

ap parishad elections
ఏపీ పరిషత్​ ఎన్నికల్లో 60.78 శాతం పోలింగ్
author img

By

Published : Apr 8, 2021, 10:55 PM IST

చిన్న చిన్న ఘటనలు మినహా.. ఏపీలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏపీవ్యాప్తంగా 60.78 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని పంచాయతీరాజ్​శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో పోలింగ్ నమోదైనట్టు చెప్పారు.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు...

జిల్లాపోలింగ్ శాతం
శ్రీకాకుళం58.37
విజయనగరం67.13
విశాఖపట్నం65.25
తూర్పు గోదావరి63.07
పశ్చిమ గోదావరి68.27
కృష్ణా63.99
గుంటూరు57.25
ప్రకాశం51.68
నెల్లూరు51.87
చిత్తూరు61.34
కర్నూలు60.28
కడప63.59
అనంతపురం58.07
మొత్తం60.78

రీపోలింగ్.. ఎక్కడెక్కడంటే..!

3 జిల్లాల్లోని 3 పోలింగ్ కేంద్రాల్లో శుక్రవారం రీపోలింగ్ ఉంటుందని గిరిజా శంకర్ తెలిపారు. విజయనగరం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రక్రియ ఉన్నట్టు చెప్పారు. విజయనగరం జిల్లా అంటిపేటలో అభ్యర్థి పేరు స్థానంలో విత్‌డ్రా చేసుకున్న వారి పేరు వచ్చిన కారణంగా.. రీపోలింగ్ అవసరమైందన్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం పొనుగుపాడులో బ్యాలెట్ బాక్స్ బయటకు వెళ్లిన కారణంగా.. అక్కడ రీపోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఉయ్యందలలో రిగ్గింగ్‌పై కలెక్టర్ నివేదిక కోరామని చెప్పారు. నివేదిక వచ్చాక రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని గిరిజా శంకర్ పేర్కొన్నారు.

ఇవీచూడండి: కరోనా 2.0: లాక్​డౌన్​ బాటలో రాష్ట్రాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.