హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు 26 కి.మీ రహదారిని ఆరు వరుసలకు విస్తరించనున్నారు. ఈ పనులకు సుమారు రూ.550 కోట్ల వ్యయం అవుతుందన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. వచ్చే వారంలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. రహదారి విస్తరణతో పాటు ఆటోనగర్ మినహా ఎనిమిది క్రాస్ రోడ్ల వద్ద ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. ఫ్లై ఓవర్లు వచ్చిన ప్రాంతాల్లో రహదారికి ఇరువైపులా మూడు వరుసల సర్వీసురోడ్లను కూడా ప్రతిపాదించారు. మూడు నాలుగు నెలల్లో విస్తరణ పనులు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు కొన్ని ప్రాంతాల్లో ఆరు వరుసల రహదారి ఉండగా కొన్ని చోట్ల నాలుగు వరుసల మార్గం ఉంది. తాజాగా మొత్తం ఆరువరుసలకు మార్చనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీనగర్ వద్ద విస్తరణ పనులు చేపట్టింది.
తొలుత 8 వరుసలకు యోచన
ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు రహదారిని విస్తరించాలన్న ప్రతిపాదన కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. గత అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డు ఇబ్బందికరంగా తయారైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన విస్తరణ ప్రతిపాదనలను తాజాగా కేంద్రం ఆమోదించింది. దండు మల్కాపూర్ వరకు ఎనిమిది వరుసలకు విస్తరించాలని అధికారులు తొలుత యోచించారు. ఆ తరువాత ఆరు వరుసలకు ప్రతిపాదనలు రూపొందిచారు. హైదరాబాద్-విజయవాడ మా ర్గం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని జాతీయ రహదారుల సంస్థ పరిధిలో ఉంది. ఎల్బీనగర్ నుంచి పంతంగి టోల్‌ప్లాజా వరకు రహదారి రహదారులు, భవనాల శాఖ పరిధిలోని జాతీ య రహదారుల విభాగం నియంత్రణలో ఉం ది. గతంలో హైదరాబాద్-విజయవాడ మార్గా న్ని ఎనిమిది వరుసలకు విస్తరించాలన్న ప్రతిపాదన ఉంది. అందుకు తగినట్లు నిర్మాణ సమయంలోనే భూసేకరణ చేశారు. దీంతో తాజాగా రహదారి విస్తరణకు కొన్ని చోట్ల తప్ప పెద్దగా ఇబ్బందులుండవని అధికారులు చెబుతున్నారు.