ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డయల్ 100కు అధికంగా ఫోన్లు వస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు. మూడు రోజుల వ్యవధిలో 6.4లక్షల కాల్స్ వచ్చినట్లు ఆయన తెలిపారు. లాక్ డౌన్ సందర్భంగా ఫిర్యాదులు పెరిగినట్లు వెల్లడించారు.
సామాజిక దూరం పాటించడం లేదని కొంతమంది ఫిర్యాదు చేస్తుండగా... కరోనా అనుమానితుల గురించి మరికొంత మంది సమాచారం ఇస్తున్నట్లు డీజీపీ వివరించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇళ్లకు పరిమితమవడమే మన ముందున్న ప్రత్యామ్నయమన్నారు. సామాజిక దూరం పాటించి పోలీసులకు సహకరించాలని మహేందర్ రెడ్డి కోరారు.
ఇవీ చూడండి: క్వారంటైన్‌కు కొత్త రూల్- గంటకో సెల్ఫీ తప్పనిసరి!