ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బాధితుల సంఖ్య.. 505కి చేరింది. 3 రోజుల్లో 332 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 153 మందికి చికిత్స కొనసాగుతోంది. చికిత్స పొందుతున్న వారిలో 71 మంది చిన్నారులు ఉండగా.. 27 మంది మహిళలు ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు, విజయవాడకు 19 మందిని తరలించారు.
వైద్యులు ఎన్నిరకాలుగా పరీక్షిస్తున్నా.. ఈ వ్యాధి ఏంటో అంతుచిక్కడం లేదు. ఇప్పటి వరకు ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తోందో గుర్తించలేకపోయారు. మరోవైపు జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని ఉంటున్నారు. ప్రాణ భయంతో కొందరు ఏలూరును వదిలి వెళ్లిపోతున్నారు.
ఇదీ చదవండి : అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: ఏపీ సీఎం జగన్