ఆంధ్రప్రదేశ్లో కరోనా కలవర పెడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో విద్యార్థులు ఉండడం గమనార్హం. కర్నూలు జిల్లాలోని ఆదోని కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 50 మంది విద్యార్థినులు, ఇద్దరు సిబ్బందికి వైరస్ నిర్ధరణ అయింది.
ఈ నెల 15న 22 మందికి వైరస్ సోకింది. 257 మంది విద్యార్థినులు చదువుకుంటున్న ఈ పాఠశాలను.. వారం రోజుల పాటు మూసివేశారు.
ఇదీ చదవండి: కరోనా విజృంభణ: ఈ నెలలోనే 11 శాతం కేసులు