ETV Bharat / city

అపార్టుమెంట్ వాసులకు జలక్‌.. ఒకేసారి 5 నెలల బిల్లుల మోత

హైదరాబాద్​ ఆనంద్‌నగర్‌కాలనీలో ఓ అపార్ట్‌మెంట్లలో 11 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో అయిదుగురు మాత్రమే తమ ఆధార్‌ను నల్లాదారుడి క్రమ సంఖ్యతో అనుసంధానం చేసుకున్నారు. అయితే తాజాగా సదరు అపార్ట్‌మెంట్‌కు జలమండలి ఐదు నెలలకు సంబంధించి నీటి బిల్లు ఒకేసారి రూ.6,475 జారీ చేసింది. ఆధార్‌తో అనుసంధానమైన ఫ్లాట్లకు మినహాయింపు లభించకపోవడంతో లబోదిబోమంటున్నారు.

5 months tap bill at one time to apartments in hyderabad

author img

By

Published : May 26, 2021, 8:59 AM IST

అపార్ట్‌మెంట్ల వాసులకు జలమండలి జలక్‌ ఇస్తోంది. ఉచిత నీటి పథకం అమలు చేసినట్లే చేసి మోకాలడ్డుతోంది. నల్లాదారుడి గుర్తింపు సంఖ్య(క్యాన్‌ నంబరు)తో ఆధార్‌ అనుసంధానమైన ఫ్లాట్లకు కూడా నీటి బిల్లుల మోత తప్పడం లేదు. నగరంలో 24,967 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 3 లక్షల ఫ్లాట్లు ఉన్నట్లు అంచనా. అపార్ట్‌మెంట్లలో ఒక్కో ప్లాటును ఒక ఇంటిగా పరిగణించాలి. అంటే అనుసంధానం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉచిత నీటిని అందించాలి. అయితే అపార్ట్‌మెంట్లను ఒక యూనిట్‌ కిందకు తీసుకోవడంతో ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో ఏ ఒక్క ప్లాట్‌ యజమాని అనుసంధానం చేసుకోకపోయినా.. మిగతా వారంతా బిల్లులు భరించాల్సిందే. ఇది సరైన విధానం కాదని నిపుణులు చెబుతున్నారు. ఫ్లాట్లకు ఇలా బిల్లులు బాదేయడం సరికాదంటున్నారు. ఇప్పటికే లింకు చేసుకున్న ఫ్లాట్లకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తం బిల్లును అన్ని ఫ్లాట్లకు సమానంగా పంచి.. అందులో నుంచి అనుసంధాన ఫ్లాట్లను మినహాయిస్తే సరిపోతుందని కొందరు సూచిస్తున్నారు.

ఉచితం వర్తించిందా? లేదా?

చందానగర్‌: మీటరు రీడర్‌ (ఎంఆర్‌) ఇంటికి వచ్చి డివైస్‌లో క్యాన్‌ నంబరు ప్రకారం బిల్లు ఇస్తేనే పథకం వర్తించే విషయం తేలనుంది. ఇప్పటి వరకు జారీ అయిన తాగునీటి బిల్లులను పరిశీలిస్తే అనుసంధానం చేసుకున్న వారందరికీ సబ్సిడీ అందుతోందని తెలుస్తోంది. అయితే కొందరు కార్యాలయాలకు ఫోన్‌ చేసి పలు సందేహాలు వెలుబుచ్చుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: కమలనాథుల వరుసమంతనాలు.. స్వతంత్ర పోటీకే ఈటల​ మొగ్గు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.