ETV Bharat / city

'కరోనా బాధితుల్లో 47.1 శాతం మంది వారే' - కరోనా బాధితుల్లో 47.1 శాతం మంది 21-40 ఏళ్ల మధ్య వారే

రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారిలోయువత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 47.1 శాతం మంది పాజిటివ్‌గా నిర్ధరణ అవుతున్నారు. ఎక్కువగా వారి నుంచి వృద్ధులకు, చిన్న పిల్లలకు వైరస్‌ సోకుతోందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

'కరోనా బాధితుల్లో 47.1 శాతం మంది వారే'
'కరోనా బాధితుల్లో 47.1 శాతం మంది వారే'
author img

By

Published : Jul 29, 2020, 5:52 AM IST

కరోనా మహమ్మారిబారిన పడుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. అందులోనూ పురుషులే అధికంగా ఉంటున్నారు. వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్‌.. ఆ విషయాన్నే తేటతెల్లం చేస్తోంది. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 47.1శాతం మందికి కరోనా సోకుతోంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో పురుషులు 65.6 శాతం మంది ఉన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేత అనంతరం ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం బయటకు వెళ్లకతప్పని పరిస్థితి నెలకొంది. ఈ కారణాలతో యువత ఎక్కువగా వైరస్‌బారిన పడుతున్నట్లుగా వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు తెరవనందున 20 ఏళ్ల లోపు వారు ఇంట్లోనే ఉంటున్నారు. 61 ఏళ్ల పైబడిన వారిలో రాకపోకలు కొనసాగించేవారుతక్కువ. ఆ కారణం వల్ల.. బయట తిరగడానికి అవకాశమున్న 21-60 మధ్య వయస్కుల వారు వైరస్ బారిన పడుతున్నారు. వారి ద్వారానే చిన్నారులు, వృద్ధులకు కరోనా వ్యాప్తి చెందుతోంది. తప్పనిసరిగా బయటకు వెళ్లేవారు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో 75.1 శాతంగా...

రాష్ట్రంలో నమోదైన మొత్తం 480 మరణాల్లో కేవలం కొవిడ్ కారణంగా మృతి చెందిన వారు 46.13 శాతం కాగా.. కరోనాతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు 53.87 శాతంగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వ్యాధి నుంచి కోలుకున్న వారి జాతీయ సగటు 64 శాతంగా ఉండగా రాష్ట్రంలో 75.1 శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 8 వేల 416 పడకలకు 2 వేల 242 పడకల్లో రోగులకు సేవలందిస్తున్నారు. మరో 6, 204 అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు బోధనాస్తుపత్రుల్లోనివి కలిపి మొత్తంగా 14 వేల 839 పడకలు అందుబాటులో ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలోని 55 ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ సేవలు అందుబాటులో ఉండగా... వాటిల్లో 4 వేల 497 పడకలున్నాయి.

జిల్లాల్లోనూ శరవేగంగా..

గ్రేటర్ హైదరాబాద్‌లోని హాట్‌స్పాట్‌గా ఉన్న డివిజన్లలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్త ప్రాంతాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాల్లోనూ కొవిడ్ శరవేగంగా వ్యాపిస్తోంది. దాదాపుగా అన్ని జిల్లాలోనూ రోజువారీగా కేసులు నమోదవుతున్నాయి. వరంగల్‌ పట్టణ జిల్లాలో.. కొత్తగా 152 మందికి కరోనా సోకింది. నిజమాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 58 మంది చొప్పున, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో 48 మంది చొప్పున పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో కరోనా భయంతో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో కరోనా వచ్చిందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐతే వృద్ధుడికి నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు.

ఇవీ చూడండి: ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.