ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 425 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రానికి చెందిన 299 మందికి పాజిటివ్‌గా తేలగా.. విదేశాల నుంచి వచ్చిన 26 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 100 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో మెుత్తం కేసులు సంఖ్య 7496కు చేరింది. ఏపీలో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 92కు చేరింది.
ఇవీ చూడండి: కరోనా వేళ వృద్ధులపై 'హెల్పేజ్ ఇండియా' సర్వేలో నమ్మలేని నిజాలు!