ETV Bharat / city

ఒక్కరోజు.. 43 రైళ్లు.. 41వేల వలసకూలీలు

దక్షిణ మధ్య రైల్వే ఒక్క రోజులో 43 శ్రామిక్ రైళ్లను నడిపించి.. 41వేల పైచిలుకు వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించింది. ద.మ.రైల్వే మే 1 నుంచి 24 వరకు 196 రైళ్లలో 2,41,768 వలస కూలీలను స్వగ్రామాలకు తరలించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఇందులో తెలంగాణ నుంచి 1.50 లక్షల పైచిలుకు వలస కూలీలను, ఆంధ్రప్రదేశ్ నుంచి 65 వేల పైచిలుకు వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలించారు.

shramik trains
shramik trains
author img

By

Published : May 24, 2020, 7:28 PM IST

వలస కార్మికులను తరలించడంతో తెలుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ... దక్షిణ మధ్య రైల్వే ముందుకెళ్తోంది. మే 1 మేడే సందర్భంగా లింగపల్లి నుంచి మొదటి సారిగా శ్రామిక్ రైలును ద.మ.రైల్వే నడిపించింది. అప్పటి నుంచి మే 24 వరకు ద.మ.రైల్వే నిరాటంకంగా శ్రామిక్ రైళ్లను నడిపిస్తోంది. గడిచిన 16రోజుల్లో లక్షమంది వలస కూలీలను తరలిస్తే... ఆ తర్వాత కేవలం వారం రోజుల్లో లక్షకు పైగా వలస కూలీలను తరలించింది.

12 గంటల్లో 41వేల వలసకార్మికులు

మే 23న ద.మ.రైల్వే జోన్ పరిధిలో కేవలం 12 గంటల్లో 43 రైళ్లను నడిపి 41వేల ప్రయాణికులను వారి స్వస్థలాలకు సురక్షితంగా చేరవేసింది. వీటిలో రెండు రైళ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌కు, ఒక రైలును మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి నడిపించారు. మిగిలిన 40 రైళ్లను తెలంగాణ నుంచి నడిపించారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 8 రైళ్లను ఒడిశాకు, ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ నుంచి 6 రైళ్లను ఝార్ఖండ్‌కు, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 10 రైళ్లను బిహార్‌కు, లింగంపల్లి స్టేషన్ నుంచి 8 రైళ్లను ఉత్తర్‌ప్రదేశ్‌కు, కాజీపేట్ స్టేషన్ నుంచి 3 రైళ్లను ఒడిశాకు, కాచిగూడ స్టేషన్ నుంచి 4 రైళ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు, మహబూబ్ నగర్ నుంచి ఒక్క రైలు ఒడిశాకు నడిపించారు.

శివారు రైల్వే స్టేషన్లతో పాటు

ద.మ.రైల్వే పరిధిలో ఇప్పటి వరకు కేవలం నగర శివార్ల నుంచి మాత్రమే శ్రామిక్ రైళ్లను నడిపించారు. మొట్టమొదటి సారిగా నగర శివారు రైల్వే స్టేషన్లతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి నడిపించారు. ఇప్పటి వరకు రాత్రి సమయంలో మాత్రమే నడిపిన రైళ్లను శనివారం మాత్రం సాయంత్రం 4 గంటల నుంచే నడిపించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఆరు గంటల తర్వాతనే మొదటి రైలు కదిలింది.

థర్మల్‌ స్క్రీనింగ్‌

రైళ్లలో వలస కూలీలను తరలించే క్రమంలో భౌతికదూరం పాటిస్తూ.. వారికి థర్మల్ స్క్రీనింగ్ చేశారు. మాస్క్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతించామని రైల్వే శాఖ ప్రకటించింది. వలస కూలీల తరలింపును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జీఎం గజానన్ మాల్య, నాంపల్లి రైల్వే స్టేషన్‌లో సీఎస్ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి శ్రామిక్ రైళ్లను పంపించేప్పుడు వెళ్లి వలస కూలీలకు వీడ్కోలు పలికారు.

ఒక్కరోజు.. 43 రైళ్లు.. 41వేల వలసకూలీలు

ఇదీ చదవండి: గొర్రెకుంట బావి ఘటనలో ఆధారాల అన్వేషణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.