ETV Bharat / city

Raithu Bhandhu: 4 రోజుల్లో 4095.78 కోట్ల నిధులు జమ - రైతుబంధు పథకం

రాష్ట్రంలో 4వ రోజు రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి రాయితీ జమ అయింది. 4 ఎకరాల పట్టాదారులకు సాయం అందగా.. ఇప్పటి వరకు 49,46,820 మంది రైతులకు లబ్ధి చేకూరింది. లబ్దిదారులకు ఇప్పటివరకూ తమ బ్యాంకు ఖాతాల్లో రూ.4095.78 కోట్లు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు.

4 thousand crores raithu bhandhu funds added farmers in telangana

author img

By

Published : Jun 19, 2021, 4:16 AM IST

రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద 4వ రోజున కూడా రైతుల ఖాతాల్లో పెట్టుబడి రాయితీ జమ అయింది. 4 ఎకరాల పట్టాదారులకు సాయం అందగా.. ఇప్పటి వరకు 49,46,820 మంది రైతులకు లబ్ధి చేకూరింది. లబ్దిదారులకు ఇప్పటివరకూ తమ బ్యాంకు ఖాతాల్లో రూ.4095.78 కోట్లు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది వానాకాలానికి సంబంధించి అన్నదాతలకు సర్కారు పెట్టుబడి సాయం పంపిణీ చేస్తోంది. రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతున్న వేళ నాలుగు రోజులుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తుండగా.. ఈ ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పథకం కింద 63లక్షల 25వేల మంది రైతులను భూపరిపాలన శాఖ అర్హులుగా తేల్చింది. 150లక్షల 18వేల ఎకరాల విస్తీర్ణానికి 7వేల 508 కోట్లు అందించనున్నారు. గత యాసంగి సీజన్‌ కన్నా 2లక్షల .81 వేల మందిని చేర్చినందున మరో 66 వేల 311 ఎకరాల విస్తీర్ణం పెరిగింది. తొలి రోజు 10 గుంటల నుంచి ఎకరం విస్తీర్ణంలోపు ఉన్నవారికి రైతుబంధు సాయం అందించింది.

ఈ మేరకు రాబోయే పదిరోజుల్లో దశల వారీగా సాయం అందజేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4లక్షల 72వేల 983 మంది పట్టదారులుండగా... 12లక్షల 18వేల ఎకరాలకు 608 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 39వేల 762 మంది అర్హులైన రైతులుండగా... 77 వేల ఎకరాలకు 38కోట్లు వేయనున్నామని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: POSTAL: 'పోస్టాఫీస్​లో రైతుబంధు డబ్బులు తీసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.