engineering counselling third phase: ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సులకు ఏపీలో నేటి నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. 2020-2021 ఉన్నత విద్యా మండలి వార్షిక నివేదికను ఆయన విజయవాడలో విడుదల చేశారు. ఈ నెలాఖరుకు మొత్తం అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు.
క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ఏర్పాటు
quality assurance cell: ఇందుకోసం.. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ద్వారా నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జాతీయ విద్యా సంస్థలతో కలిసి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను.. 5 క్లస్టర్లుగా విభజించి ఉన్నత విద్య అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
campus selections: గతేడాది 70 వేల మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు పొందినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,700 కాలేజీలు వచ్చే మూడేళ్లలో న్యాక్ (NAC) అక్రిడేషన్ తీసుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు ఏడాది పొడవునా తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు.