ETV Bharat / city

3PM TOPNEWS: టాప్​ న్యూస్ @3PM - topnews telangana

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Jul 18, 2022, 2:58 PM IST

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్​లో ఎమ్మెల్యే సీతక్క ఓటుహక్కు వినియోగించుకున్న సందర్భంలో స్వల్ప అయోమయం చోటుచేసుకొంది. బ్యాలెట్ పత్రంపై ఇంక్​ పడటంతో మరో బ్యాలెట్​ ఇవ్వాల్సిందిగా సీతక్క అధికారులను కోరారు. ఇందుకు ఈసీ నిరాకరించడంతో చేసేదేమీలేక అదే బ్యాలెట్​ పత్రాన్ని బాక్సులో వేసి వెళ్లిపోయారు.

  • 'దసరా తర్వాత ఆస్పత్రి నిర్మాణ పనులు'

వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వరంగల్‌ పర్యటనలో ఉన్న ఆయన సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తో కలిసి ఆస్పత్రి పనులతోపాటు, నిర్మాణ నమూనా పరిశీలించారు.

  • సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పీడీ ఖాతాలకు మళ్లించిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను.. రెండు వారాల్లోగా వెనక్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • యువకుడిని ఉమ్మి నాకించిన పంచాయతీ పెద్దలు!

బిహార్​ బెగూసరాయ్​లో అమానవీయ ఘటన జరిగింది. రూ. 12 వేలు దొంగతనం చేశాడనే అనుమానంతో పంచాయతీ పెద్దలు.. ఓ యువకుడిని ఉమ్మి నాకించి, గుంజీలు తీయించిన దుశ్చర్య మోహన్​పుర్​ గ్రామంలో వెలుగుచూసింది.

  • నాన్​స్టాప్​గా వర్షాలు.. టార్పాలిన్ కింద బామ్మ అంత్యక్రియలు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ వృద్ధురాలి అంత్యక్రియలు టార్పాలిన్ కింద నిర్వహించారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

  • గుంతలో పడ్డ గున్న ఏనుగు.. సీపీఆర్​ చేసి రక్షించిన సిబ్బంది

థాయ్‌లాండ్‌ నఖోన్ నాయొక్ రాష్ట్రంలోని ఖావో యాయ్ జాతీయ పార్క్​లో ఓ భారీ గుంతలో ఏడాది వయసున్న గున్న ఏనుగు పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు తల్లి ఏనుగు శాయశక్తులా ప్రయత్నించింది. వర్షం, బురద కారణంగా దాని ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే..

  • అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్​ పదవికి 'బత్రా' రాజీమానా

అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఐహెచ్​ఎఫ్​) అధ్యక్షుడు నరిందర్ బత్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐహెచ్​ఎఫ్ చీఫ్ పదవితో పాటు ఐఓఏ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

  • ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..

నాగ చైతన్య మూవీ 'థ్యాంక్యూ', రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన 'షంషేరా'తో పాటు మరికొన్ని సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్నాయి. వెంకటేశ్​ దగ్గుబాటి- వరుణ్​ తేజ్​ నటించిన ఎఫ్‌3, ధనుశ్​ 'ద గ్రే మ్యాన్‌'తో పాటు పలు సినిమాలు, వెబ్​ సిరీస్​లు ఓటీటీలో స్ట్రీమింగ్​ కానున్నారు.

  • నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 13 మంది మృతి..

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లగా.. 13 మంది మరణించారు. మరో 15 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ధార్ జిల్లా ఖాల్​ఘాట్​ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

  • ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్​ఖడ్ నామినేషన్

ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్​ఖడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, భాజపా అగ్రనేతలు పాల్గొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, భాజపా నాయకత్వానికి ధన్​ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు.

  • సీతక్క పొరపాటు..

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్​లో ఎమ్మెల్యే సీతక్క ఓటుహక్కు వినియోగించుకున్న సందర్భంలో స్వల్ప అయోమయం చోటుచేసుకొంది. బ్యాలెట్ పత్రంపై ఇంక్​ పడటంతో మరో బ్యాలెట్​ ఇవ్వాల్సిందిగా సీతక్క అధికారులను కోరారు. ఇందుకు ఈసీ నిరాకరించడంతో చేసేదేమీలేక అదే బ్యాలెట్​ పత్రాన్ని బాక్సులో వేసి వెళ్లిపోయారు.

  • 'దసరా తర్వాత ఆస్పత్రి నిర్మాణ పనులు'

వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వరంగల్‌ పర్యటనలో ఉన్న ఆయన సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తో కలిసి ఆస్పత్రి పనులతోపాటు, నిర్మాణ నమూనా పరిశీలించారు.

  • సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పీడీ ఖాతాలకు మళ్లించిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను.. రెండు వారాల్లోగా వెనక్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • యువకుడిని ఉమ్మి నాకించిన పంచాయతీ పెద్దలు!

బిహార్​ బెగూసరాయ్​లో అమానవీయ ఘటన జరిగింది. రూ. 12 వేలు దొంగతనం చేశాడనే అనుమానంతో పంచాయతీ పెద్దలు.. ఓ యువకుడిని ఉమ్మి నాకించి, గుంజీలు తీయించిన దుశ్చర్య మోహన్​పుర్​ గ్రామంలో వెలుగుచూసింది.

  • నాన్​స్టాప్​గా వర్షాలు.. టార్పాలిన్ కింద బామ్మ అంత్యక్రియలు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ వృద్ధురాలి అంత్యక్రియలు టార్పాలిన్ కింద నిర్వహించారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

  • గుంతలో పడ్డ గున్న ఏనుగు.. సీపీఆర్​ చేసి రక్షించిన సిబ్బంది

థాయ్‌లాండ్‌ నఖోన్ నాయొక్ రాష్ట్రంలోని ఖావో యాయ్ జాతీయ పార్క్​లో ఓ భారీ గుంతలో ఏడాది వయసున్న గున్న ఏనుగు పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు తల్లి ఏనుగు శాయశక్తులా ప్రయత్నించింది. వర్షం, బురద కారణంగా దాని ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే..

  • అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్​ పదవికి 'బత్రా' రాజీమానా

అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఐహెచ్​ఎఫ్​) అధ్యక్షుడు నరిందర్ బత్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐహెచ్​ఎఫ్ చీఫ్ పదవితో పాటు ఐఓఏ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

  • ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..

నాగ చైతన్య మూవీ 'థ్యాంక్యూ', రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన 'షంషేరా'తో పాటు మరికొన్ని సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్నాయి. వెంకటేశ్​ దగ్గుబాటి- వరుణ్​ తేజ్​ నటించిన ఎఫ్‌3, ధనుశ్​ 'ద గ్రే మ్యాన్‌'తో పాటు పలు సినిమాలు, వెబ్​ సిరీస్​లు ఓటీటీలో స్ట్రీమింగ్​ కానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.