ETV Bharat / city

కొత్తల్లుడికి విందు అదుర్స్​.. గోదారోళ్ల మర్యాదలంటే తగ్గేదే లే.! - కొత్తల్లుడికి విందు అదుర్స్

365 variety of dishes to new son in law: మర్యాదలకు పుట్టినిళ్లు గోదావరి జిల్లాలు. ఈ జిల్లాల్లో అతిథులకు ఇచ్చే ఆతిథ్యం మరువలేనిది. సంక్రాంతి పండుగ పిండివంటల గురించి ఇక చెప్పనక్కర్లేదు. కొత్త అల్లుళ్లకు అన్ని రకాల వంటలు, మర్యాదలతో ముంచెత్తుతారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కొత్త అల్లుళ్లకు 365 రకాల వంటకాల రుచి చూపించారు.

365 variety of dishes to new son in law
గోదావరి జిల్లాల్లో అల్లుడికి మర్యాదలు
author img

By

Published : Jan 17, 2022, 2:43 PM IST

365 variety of dishes to new son in law: సంక్రాంతి వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంత ఊళ్లో వాలిపోతారు. గోదారోళ్లు అయితే అల్లుళ్లకు చేసే మర్యాదలు చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణానికి చెందిన మానే నాగేశ్వరరావు, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె యశోద సాయి. ఆ అమ్మాయికి ఇటీవల కృష్ణాజిల్లా లక్ష్మీ పురానికి చెందిన పులగం త్రిమూర్తులు, నాగ కుమారి దంపతుల కుమారుడు వినయ్ కుమార్​కు ఇచ్చి వివాహం చేశారు. ఇరువురు హైదరాబాద్​లో ఉద్యోగం చేస్తున్నారు. వివాహం తర్వాత తొలి సంక్రాంతి కావడంతో అల్లుడు వినయ్ కుమార్, వియ్యపురాలు నాగ కుమారిని సంక్రాంతి పండుగకు ఆహ్వానించారు.

గోదారోళ్ల మర్యాదలంటే తగ్గేదే లే

కొసరి కొసరి వడ్డింపులు

కనుమ పురస్కరించుకుని అల్లుడికి నాగేశ్వరరావు దంపతులు 365 రకాల ఆహార పదార్థాలు సమకూర్చి విందు ఇచ్చారు. వీటిలో ప్రధానంగా 40 రకాల ఘుమఘుమలాడే గరం మసాలా మాంసాహారం కూరలు తయారు చేయడంతో పాటు 140 రకాల పిండి వంటలు, పండ్లు, ఐస్ క్రీం, డ్రింక్ల్​ , వివిధ రకాల స్నాక్స్ తో విందు భోజనం వడ్డించారు. తినలేను బాబోయ్ అనే దాకా వదలమంటే వదలమంటూ కొసరి కొసరి వడ్డించారు. వీరు ఇచ్చిన ఆతిథ్యం వియ్యాలవారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇదీ చదవండి: కాసేపట్లో రాష్ట్ర కేబినెట్​ భేటీ.. రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.