ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 83,885 మంది నమూనాలు పరీక్షించగా.. 3,166 కొత్త కేసులు నమోదయ్యాయి. 21 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 4,019 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,356 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...
ఇదీ చదవండి: KISHAN REDDY : సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి