Hajj Yatra 2022: దేశంలో హజ్‌యాత్ర సౌకర్యవంతంగా సాగేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, రెండు తెలుగు రాష్ట్రాల హజ్ కమిటీ ఛైర్మన్లు ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 3 వేల మంది హజ్‌యాత్రకు వెళ్తున్నట్టు మంత్రులు తెలిపారు. ఈ నెల 20 నుంచి హజ్‌యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని హజ్‌హౌస్‌లో హజ్ క్యాంప్ ఈ నెల 18 నుంచి 30 వరకు కొనసాగుతుందని వివరించారు.
ఈ ఏడాది తెలంగాణ నుంచి 2125, ఆంధ్రప్రదేశ్ నుంచి 875 మంది.. మొత్తంగా 3,000 మంది హజ్‌యాత్రకు వెళ్తున్నారని మంత్రులు తెలిపారు. జూన్ 20 నుంచి 30 వరకు 8 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినట్లు మంత్రులు వివరించారు. జూలై 28 నుంచి ఆగస్టు 6 వరకు యాత్రికులు తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు. ఈ వీసా సౌకర్యాన్ని హజ్ కమిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
"రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి హజ్‌యాత్రికుల కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. హజ్ యాత్ర కోసం కావాల్సిన నిధులు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే.. ఇప్పటివరకు హజ్ యాత్ర సాఫీగా సాగుతూ వస్తోంది. హజ్ యాత్ర సౌకర్యవంతంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్న ఏకైన రాష్ట్రం తెలంగాణనే." - మహమూద్ అలీ, హోం మంత్రి
ఇవీ చదవండి: